Maoists Surrendered: మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్!
Maoists Surrendered: మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ సహా 15మంది మావోయిస్టులు లొంగిపోయారు.

Maoists Surrendered: మావోయిస్టు పార్టీకి మరోసారి చావు దెబ్బ తగిలింది. పార్టీలో కీలకంగా వ్యవహరించే లీడర్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనతోపాటు మరో 15 మంది మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చేశారు. జనవరి నుంచి సాయుధ విరమణ చేస్తున్నామని ప్రకటించిన ఒక రోజులోనే ఈ లొంగుబాటు జరిగింది.
మహారాష్ట్ర పోలీసుల ఎదుట మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్ ఘఢ్ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ లొంగిపోయారు. 15 మంది మావోయిస్టులతో కలిసి ఆయుధాలు వీడారు. ఆయుధాలను అప్పగించి జనజీవన స్రవంతిలోకి వస్తున్నట్టు పోలీసులకు తెలియజేశారు. జనవరి 1 వ తేదీన సాయుధ విరమణ చేస్తున్నట్టు లేఖ విడుదల చేసిన 24 గంటల్లో అనంత్ లొంగిపోవడం అందర్నీ షాక్‌కి గురి చేశారు.
అనంత్ లొంగుబాటు ఇలా ఉంటే మరో కీలక దేవ్‌జి కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దేవ్‌జిగా పిలుచుకునే తిప్పరి తిరుపతి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఏర్పాటులో మాస్టర్ మైండ్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఈయన మోస్ట్ వాటెండ్ లిస్ట్‌లో ఉన్న అతి పెద్ద నేత. దీనిపై పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. హిడ్మా ఎన్‌కౌంటర్ జరిగిన రోజునే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇద్దరు మహిళలతోపాటు దేవ్‌జీని కూడా అదుపులోకి తీసుకున్నారని, అయితే మహిళల అరెస్టును చూపిన పోలీసులు దేవ్‌జీ గురించి కావాలనే సమాచారం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.





















