Hema Chandra : శ్రావణ భార్గవితో డివోర్స్ రూమర్స్! - సింగర్ హేమచంద్ర స్ట్రాంగ్ రియాక్షన్
Hema Chandra Reaction : తెలుగు ఫేమస్ సింగర్స్ హేమచంద్ర, శ్రావణి భార్గవి డివోర్స్ ప్రచారం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై సింగర్ హేమచంద్ర స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు.

Singer Hema Chandra Reaction On Divorce Rumours : టాలీవుడ్ టాప్ సింగర్స్ హేమచంద్ర, శ్రావణ భార్గవి 2013లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి ప్రేమకు గుర్తుగా 2016లో ఈ దంపతులకు పాప శిఖర చంద్రిక జన్మించింది. అయితే, గత మూడేళ్లుగా ఈ కపుల్ విడివిడిగా ఉంటున్నారనే ప్రచారం సాగుతుండగా... డివోర్స్ రూమర్స్ బలంగా వినిపించాయి. ఇప్పటివరకూ అటు శ్రావణ భార్గవి కానీ, హేమచంద్ర కానీ డివోర్స్ వ్యవహారంపై బహిరంగంగా ఎక్కడా రియాక్ట్ కాలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హేమచంద్ర స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.
అసలు మీకేంటి ఉపయోగం?
శ్రావణ భార్గవితో డివోర్స్ వ్యవహారంపై హేమచంద్రకు తాజా ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురవగా... కాస్త ఘాటుగానే స్పందించారు. డివోర్స్ రూమర్స్ నిజమా? కాదా? ఎవరైనా సోషల్ మీడియాలో కావాలనే వ్యాప్తి చేస్తున్నారా? అనే విషయాలు పక్కన పెడితే ఈ విషయం తెలుసుకోవడం వల్ల మీకేంటి ఉపయోగం? అని అడిగారు. 'దీని వల్ల మీకేమైనా పనికొస్తుందంటే చెప్పండి. దీని గురించి మాట్లాడతా. నాపై వచ్చే కామెంట్స్ అస్సలు పట్టించుకోను.
ఏదో ఒక రకంగా ఎప్పుడూ వార్తల్లో ఉండాలనుకునే వ్యక్తిని కాదు. ఓ సింగర్‌గా నేను అందరికీ తెలుసు. నా వర్క్, కెరీర్ గురించి క్వశ్చన్స్ అడగండి. వాటి గురించి చెబుతాను. నా మాటల వల్ల ఒక్కరు ఇన్ స్పైర్ అయినా చాలు.' అని అన్నారు.
Also Read : వంద జన్మలకూ మళ్లీ మళ్లీ రజనీలానే పుట్టాలని ఉంది - తలైవా ఎమోషనల్ స్పీచ్‌కు ఫ్యాన్స్ ఫిదా
అప్పుడే ఆన్సర్ చెబుతా...
తన పర్సనల్ విషయాల గురించి ఎవరైనా తెలుసుకోవాలంటే ఓ షో ఏర్పాటు చేయాలంటూ సలహా ఇచ్చారు హేమచంద్ర. 'ఆ స్పెషల్ షోలో అందరం కలుసుకుందాం. ఎవరైనా ఆ క్వశ్చన్ అడిగితే నీకు ఈ విషయం ఎందుకు తెలుసుకోవాలని ఉంది? అని నేను అడుగుతా. వారు కరెక్ట్ సమాధానం చెబితే నేను దీనిపై ఆన్సర్ చెప్తా. టైం వచ్చినప్పుడే ఈ విషయం గురించి మాట్లాడతాను.' అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే, గత మూడేళ్లుగా ఈ కపుల్ విడివిడిగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. తాజాగా హేమచంద్ర కామెంట్స్‌తో డివోర్స్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది.





















