Mana Shankaravaraprasad Garu OTT : 'మన శంకరవరప్రసాద్ గారు' ఓటీటీ బిగ్ డీల్ ఫిక్స్! - మెగాస్టార్ మూవీ అంటే అట్లుంటది మరి
Mana Shankaravaraprasad Garu OTT Platform : మెగాస్టార్ చిరంజీవి, అనిల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మన శంకరవరప్రసాద్ గారు' రిలీజ్‌కు ముందే బిజినెస్ ఊపందుకుంది. ఓటీటీ డీల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

Chiranjeevi's Mana Shankaravaraprasad Garu OTT Platform Locked : మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మన శంకరవరప్రసాద్ గారు'. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుండగా... ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాక ముందే ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.
ఓటీటీ డీల్ ఫిక్స్
ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'ZEE5' సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, శాటిలైట్ రైట్స్‌ను జీ నెట్‌వర్క్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు బిగ్ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతుండగా... రిలీజ్‌కు ముందే భారీ బిజినెస్ జరుగుతున్నట్లు సమాచారం. థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత మూవీ ఓటీటీలోకి ఆ తర్వాత టీవీల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది.
Also Read : వంద జన్మలకూ మళ్లీ మళ్లీ రజనీలానే పుట్టాలని ఉంది - తలైవా ఎమోషనల్ స్పీచ్‌కు ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్‌లో మీసాలపిల్ల
ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన చిరు లుక్స్, మెగాస్టార్ ఎంట్రీ స్పెషల్ వీడియోతో పాటు 'మీసాల పిల్ల' సాంగ్ ట్రెండ్ సృష్టిస్తోంది. సోషల్ మీడియాను ఈ సాంగ్ ఓ ఊపు ఊపేస్తుండగా లక్షల్లో రీల్స్ చేస్తున్నారు. ఇక మిగిలిన పాటల కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మూవీలో చిరు స్టైలిష్, వింటేజ్ లుక్ అదిరిపోయింది. గతంలో మూవీస్ కంటే డిఫరెంట్‌గా ఓ సరికొత్త సైలిష్ లుక్‌లో మెగాస్టార్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ ఓ స్పెషల్ రోల్ చేస్తున్నారు. వీరితో పాటే వీటీవీ గణేష్, కేథరిన్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























