Hyderabad Cyber Fraud :హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం - మోనికా పేరుతో వైద్యుడిపై వల- రూ. 14 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు
Hyderabad Cyber Fraud :సోషల్ మీడియాలో వచ్చిన రిక్వస్ట్ యాక్సెప్ట్ చేసిన వైద్యుడు 14 కోట్లు కోల్పోయాడు. ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఆ వ్యక్తిని నిండా ముంచేశారు.

Hyderabad Cyber Fraud :సైబర్ నేరగాళ్లు ఓ వైద్యుణ్ని మోసం చేసి 14 కోట్లను స్వాహా చేశారు. అమ్మాయి పేరుతో చాట్ చేసి ట్రేడింగ్ చేస్తూ నిలువునా ముంచేశారు. చివరకు తాను మోసపోయినట్టు ఆలస్యంగా గ్రహించిన ఆ డాక్టర్ పోలీసులను సంప్రదించి వివరాలు అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ నెంబర్లు, ఇతర సాక్ష్యాలు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు ఎన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నా, ఎంతలా హెచ్చరికలు చేస్తున్నా, ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నా సరే సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏదో రూపంలో ప్రజలను మాయ చేసి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి కేసు ఒకటి హైదరాబాద్‌లో వెలులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయం ఆ డాక్టర్‌కు 14 కోట్లు పోయేలా చేసింది. ట్రేడింగ్ పేరుతో ముందుగా లాభాలు చూపించి ఓ దశ దాటిన తర్వాత నిలువునా ముంచేశారు.
ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్లు, ఇతర ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఏఐ టెక్నాలజీ పెరగడంతో దాని ఆధారంగానే ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ను కూడా ఇలానే మోసం చేశారు. సోషల్ మీడియాలో ఆయనకు మొదట ఓ రిక్వస్ట్ వచ్చింది. అందులో మోనిక పేరుతో రిక్వస్ట్ వచ్చింది. అందులో అందమైన యువతి ఫొటో ఉంది. రిక్వస్ట్‌కు ఓకే చెప్పరు డాక్టర్. తర్వాత వారి మధ్య చాలా కాలం చాటింగ్ నడిచింది. మధ్యలో బిజినెస్ ప్రస్తావన వచ్చింది. తనకు ట్రేడింగ్‌లో మంచి ఎక్స్‌పీరియన్స్ ఉందని చెప్పి మాయమాటలు చెప్పింది. వాటిని అంతగా నమ్మకం కుదరలేదు. కానీ చూద్దాంలే అని చెప్పి కాస్త తక్కువ పెట్టుబడితోనే మొదలు పెట్టారు. అంతే వాటికి భారీ లాభాలు వచ్చాయి.
ఇలా వారు పంపించిన లింక్‌లు ఆధారంగా పెట్టుబడులు పెట్టారు. మొదట్లో లాభాలు రావడంతో పెట్టుబడి పెంచారు. అయితే ఒక స్థాయి దాటిపోయిన తర్వాత లాభాలు కనిపిస్తున్నాయి కానీ వాటిని విత్‌డ్రా చేసుకునేందుకు వీలు లేకుండా పోయింది. అప్పటికే పెద్దగా నష్టాలు లేనందున వాటి గురించి డాక్టర్ పట్టించుకోలేదు. కానీ అటు నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది. కొద్దిగా ట్యాక్స్ కట్టేస్తే ఆ డబ్బులు వస్తాయని కూడా చెప్పింది. దీన్ని కూడా పట్టించుకోలేదు. కానీ ఒత్తిడి పెరగడంతో డబ్బులు ఊరికే ఎందుకు వదులుకుంటారని చెప్పడంతో మనసు మెత్తబడింది.
వారు చెప్పినట్టుగా పంపిన లింక్‌ల ద్వారా వాళ్లు చెప్పిన డబ్బులు పే చేశారు. అంతే అప్పటి వరకు తరచూ వచ్చేఫోన్‌లు రావడం మానేశాయి. మోనిక కూడా స్పందించడం లేదు.దీంతో మోసపోయినట్టుగా భావించిన డాక్టర్ పోలీసులను ఆశ్రయించాడు. మొత్తంగా సైబర్ నేరగాళ్లకు 14కోట్లు ముట్టచెప్పినట్టు తేలింది. వివరాలు తెలుసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు.





















