అన్వేషించండి

Cyclone Ditwah Impact: దూసుకొస్తున్న దిత్వా తుపాను- ఈ జిల్లాల్లో ఫ్లాష్‌ఫ్లడ్స్‌ వచ్చే ఛాన్స్‌!

Cyclone Ditwah Impact: బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలపై పడుతోంది. ఆ జిల్లాలకు వాతావరణ శాఖాధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

Cyclone Ditwah Impact: బంగాళాతంలో ఏర్పడిన దిత్వా తుపాను శ్రీలంక వైపుగా దూసుకొస్తోంది. దీని ప్రభావం రాయలసీమలోని కొన్ని జిల్లాలు, కోస్తాలోని మరికొన్ని జిల్లాలపై ఉంటుంది. అందుకే ఆ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వరదలతోపాటు ఈదురుగాలులు వీస్తాయని కూడా హెచ్చరిస్తున్నారు. తీరంవెంబడి జనం అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.

దిత్వా తుపాను ఉత్తర వాయవ్య దిశగా కదులుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం చెన్నైకి 430 కిలోమీటర్ల దూరంలో ఉందని వెల్లించారు. రాయలసీమ, కోస్తాంధ్రలోని జిల్లాలపై రెండు రోజుల పాటు ప్రభావం చూపుతుందని శని, ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు. ఏపీ విపత్తుల సంస్థఎండీ ప్రఖర్ జైన్ చెప్పిన వివరాలు పరిశీలిస్తే దిత్వా ఆదివారం తెల్లవారుజామున తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు సమీపంగా వస్తుందని తెలిపారు. 

తుపాను ప్రభావంతో చిత్తూరు, తిరపతి, ప్రకాం, నెల్లూరు, కడప, అన్నయ్యజిల్లాల్లో ప్లాష్‌ఫ్లడ్స్ వస్తాయని అధికారులు హెచ్చరించారు. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వీటితోపాటు కర్నీలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లా, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయి. కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరులో కూడా వర్షాల ప్రభావం ఉంటుందని సూచించారు. 

దిత్వా తుపానుపై హోంమంత్రి సమీక్ష

నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను నేపధ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. తుపాను తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రభావిత జిల్లాలని అలెర్ట్ చేయాలని సూచించారు. సహయక చర్యలకు SDRF, NDRF బృందాలు పంపించాలని ఆదేశించారు.

అధికారులకు కీలక సూచనలు 

రేపు, ఎల్లుండి ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్ష సూచన ఉందని అధికారులు వివరించారు. జిల్లా కలెక్టర్లతో హోంమంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు కిందిస్థాయి అధికారులకు, ప్రజలకు తెలియజేయాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అనుక్షణం అలెర్ట్ గా ఉండాలన్నారు. కంట్రోల్ రూమ్‌లను 24/7 కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. 

సమస్య ఉంటే సంప్రదించాల్సిన టోల్‌ఫ్రీ నెంబర్లు ఇవే

ఏదైనా సమస్యలు ఉంటే విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101  సంప్రందించాలి. శిథిలావస్థలో ఉన్న ఇళ్ళల్లో ఉండే వారిని గుర్తించి ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. అవసరమైతే ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. విరిగిన చెట్లు తొలగించడం , విద్యుత్తు అంతరాయం జరిగితే పునరుద్ధరణ పనులు వెంటనే జరిగేలా ఏర్పాటు చేయాలన్నారు. భారీవర్షాలు కురుస్తున్నపుడు వీలైనంత వరకు ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బలమైన ఈదురుగాలుల వీచేప్పుడు చెట్లు, హోర్డింగ్స్ వద్ద ఉండొద్దన్నారు.           

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Advertisement

వీడియోలు

PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Indigo Airlines Issue | ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఇండియో ఎయిర్‌లైన్స్ | ABP Desam
Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam
సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Rupee Falling News: వంట నుంచి వాహనం నడపడం వరకు; రూపాయి పతనంతో జరిగే పరిణామాలు తెలుసుకోండి?
వంట నుంచి వాహనం నడపడం వరకు; రూపాయి పతనంతో జరిగే పరిణామాలు తెలుసుకోండి?
Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
US warning to Pakistan:  ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక
ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక
Putin Religion: లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
Embed widget