అన్వేషించండి

MI vs DC Highlights: కెప్టెన్ హర్మన్ ప్రీత్ విధ్వంసం..ఢిల్లీపై 50 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం

MIW vs DCW Highlights: ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ను 50 రన్స్ తేడాతో ఓడించింది. హర్మన్ ప్రీత్ కౌర్ 74 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

Mumbai Indians vs Delhi Capitals WPL Highlights: మహిళల ప్రీమియర్ లీగ్ 2026 మూడో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ను 50 పరుగుల తేడాతో ఓడించింది. ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 74 పరుగులు చేసి MI విజయంలో కీలక పాత్ర పోషించింది.

నవీ ముంబైలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 195 పరుగులు చేసింది. ఛేజింగ్ చేయడానికి బ్యాటింగ్ దిగిన ఢిల్లీ జట్టు మొత్తం 20 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. 145 పరుగులకే ఆలౌట్ కావడంతో ముంబై 50 ఫరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. WPL 2026 తొలి మ్యాచ్‌లో, ముంబై ఇండియన్స్ RCB చేతిలో 1 పరుగు తేడాతో ఓడిపోయింది. అయితే, ఈసారి MI సమష్టిగా ఆడి ఢిల్లీపై 50 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది.

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అర్ధశతకం 
ముంబై తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 42 బంతుల్లో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఈ ఇన్నింగ్స్‌లో ఆమె 8 ఫోర్లు, 3 సిక్సర్లు బాదింది. ఆమె నాట్ స్కైవర్ బ్రంట్‌తో 66 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఆమె నికోలా కారీతో కలిసి 25 బంతుల్లో 63 పరుగులు జోడించింది. ముంబై ఇన్నింగ్స్‌లో 29 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం.

షెఫాలీ వర్మ విఫలం
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున భారత స్టార్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ షెఫాలీ వర్మ రాణించలేకపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ లిజెల్ లీతో కలిసి ఆమె ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్లు ఇద్దరూ 32 పరుగులకే అవుట్ అయ్యారు. షెఫాలి కేవలం 8 పరుగులు మాత్రమే చేసింది. 

ఢిల్లీ జట్టు పేలవమైన ప్రారంభం నుండి ఏ దశలోనూ కోలుకోలేదు. స్కోరు 46 పరుగులకు చేరుకునే సమయానికి సగం మంది విలియన్‌ చేరారు. దాంతో ఢిల్లీ ఓటమి తప్పలేదు. ఢిల్లీ బ్యాటర్ చినెల్లె హెన్రీ 33 బంతుల్లో 56 పరుగులు చేసి అర్ధ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మన్ గా నిలిచింది. ఢిల్లీ తరఫున నికి ప్రసాద్ 12 పరుగులు చేసి రెండవ అత్యధిక స్కోరర్‌గా నిలిచింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Advertisement

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget