అన్వేషించండి

Viral News: ఇండియన్ రైళ్లలో టాయిలెట్లు ఏర్పాటు వెనుక ఉన్న వింత సంఘటన మీకు తెలుసా!

Indian Railways News | ఒక్క లెటర్ తో బ్రిటిష్ ప్రభుత్వంలో భారతీయుడు చంద్రసేన్ కదలిక తెచ్చారు. క్రమంగా దేశంలో అన్ని రైళ్లలో టాయిలెట్స్ ఏర్పాటు చేశారు.

Toilets in Indian Railways | అర్జెంటుగా టాయిలెట్ కి వెళ్ళాల్సి వచ్చి ట్రైన్ దిగితే.. ఆ ట్రైన్ కదిలిపోయింది. ఒక చేత్తో లోటా.. మరో చేత్తో దోవతీ పట్టుకుని ఆ ట్రైన్ ఆపండి అంటూ వెనకాల పరిగెడుతూ ఉంటే.. చూసే వాళ్ళందరూ నవ్వుతుంటే ఆ సంఘటన చెప్పుకోవడానికి కామెడీగాను.. అనుభవించిన వాళ్ళకి నరకం గాను ఉంటుందనడం లో ఎలాంటి అనుమానం లేదు. కానీ నిజంగా జరిగిన ఆ సంఘటన ఈరోజు రైళ్లలో టాయిలెట్లు ఏర్పాటుకు కారణమైందంటే నమ్మగలరా?
దూర ప్రయాణానికి ఎక్కువమంది  ఎంచుకునే రవాణా సౌకర్యం రైల్వేలు మాత్రమే. మధ్యతరగతి,ఎగువ మధ్య తరగతి ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించడానికి ముఖ్య కారణం వాటిలోని టాయిలెట్ సౌకర్యమే. టాయిలెట్స్ లేని రైళ్లను ప్రస్తుతం ఊహించడం కూడా కష్టమే.. కానీ భారతీయ రైల్వేలలో  టాయిలెట్ల ఏర్పాటు వెనుక  వందేళ్ళ క్రితం ఒఖిల్ చంద్రసేన్ అనే ఒక భారతీయుడు పడిన ఇబ్బంది కారణం అయింది.

 ఒకప్పుడు భారతీయ రైళ్లలో టాయిలెట్స్ ఉండేవి కావు 

1853 నుండి బ్రిటిష్ ఇండియాలోట్రైన్స్ నడుస్తున్నా వాటిలో ప్రయాణికుల కోసం టాయిలెట్ సౌకర్యం ఉండేది కాదు.మొదట్లో మరీ దూరం వెళ్లే ట్రైన్స్ లేకపోవడమే దీనికి కారణం. నెమ్మదిగా దూర ప్రాంతాలకు వెళ్లే ట్రైన్స్ కూడా పట్టాలపై పరుగులు తీయడం మొదలైంది. అని టాయిలెట్స్ ఏర్పాటు పై అప్పటి బ్రిటిష్ వాళ్లు పెద్దగా దృష్టి పెట్టే వాళ్ళు కాదు. 50 ఏళ్ల పాటు ఇదే పరిస్థితి కొనసాగింది. చివరికి 1909లో మొట్టమొదటిసారిగా అప్పర్ క్లాస్ బోగీల్లో టాయిలెట్స్ ని ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. దీని వెనక "ఒఖిల్ చంద్రసేన్" అనే భారతీయుడు పడిన ఇబ్బంది ప్రధాన కారణం.

2 జులై 1909 న బెంగాల్ లోని అహ్మద్ పూర్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. 'ఒఖిల్ చంద్రసేన్, అనే వ్యక్తి ట్రైన్ లో ప్రయాణిస్తుండగా  ఆయన టాయిలెట్ కి వెళ్ళాల్సి వచ్చింది. బెంగాల్ లోని  "అహ్మద్ పురి " స్టేషన్ వద్ద ఆయన ట్రైన్ దిగారు. ఈలోపు గార్డ్ సిగ్నల్ ఇవ్వడంతో ట్రైన్ కదిలిపోయింది. దానితో కంగారుపడిన చంద్రసేన్ ఆ రైలు ఆపండి అంటూ దాని వెనకాలే ఒక చేత్తో నీళ్ల లోటా, మరో చేత్తో దోవతీ పట్టుకుని పరిగెత్త సాగారు. వేగాన్ని అందుకోలేక పడిపోయిన ఆయన్ను చూసి స్టేషన్లోని జనాలు నవ్వడంతో  తీరని అవమానానికి గురయ్యారు చంద్రసేన్.

Viral News: ఇండియన్ రైళ్లలో టాయిలెట్లు ఏర్పాటు వెనుక ఉన్న వింత సంఘటన మీకు తెలుసా!

"హబీబ్ గంజ్" రైల్వే డివిజనల్ ఆఫీస్ కు వచ్చీ రాని ఇంగ్లీష్ లోనే ఒక లెటర్ రాస్తూ తాను పడిన ఇబ్బందిని వివరించారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు దూర ప్రాంత ప్రయాణికులు పడుతున్న ఇబ్బంది ని దృష్టిలో పెట్టుకుని 80Km ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లలో టాయిలెట్ లను ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. మొదట్లో హై క్లాస్ బోగీల్లోనే ఈ ఏర్పాటు చేసినా తర్వాతి కాలంలో జనరల్ బోగీల్లోకి కూడా టాయిలెట్స్ వచ్చేసాయి. అయితే 2016 వరకూ ట్రైన్ డ్రైవర్లకు ఈ అవకాశం ఉండేది కాదు. 2016 నుంచి తయారవుతున్న లోకో ఇంజన్ లలో టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నారు. దీనితో చాలాకాలంగా సమస్యలు ఎదుర్కొన్న  ట్రైన్ డ్రైవర్లకు ( పైలెట్ ) ఒక పరిష్కారం దొరికింది.

 ఇప్పటికీ భద్రంగా ఉన్న చంద్రసేన్ లెటర్ 

 రైళ్ల లో టాయిలెట్లు  కోరుతూ 1909 లో  ' ఒకీల్ చంద్రసేన్ ' రాసిన లెటర్ ఇప్పటికి ఢిల్లీలోని రైల్వే మ్యూజియంలో  భద్రంగా ఉంది. వృద్ధులకు, చిన్న పిల్లలకు, మహిళలకు దూర ప్రయాణాలు ఎదురయ్యే అతిపెద్ద సమస్యకు పరిష్కారం దొరకడానికి కారణమైన "ఒకిల్ చంద్రసేన్ " ను గుర్తు చేసుకోవడమే ఆయనకు మనం ఇచ్చే నివాళి. 

Also Read: Beautiful Handwriting : ప్రపంచంలోనే అందమైన చేతిరాత ఇదేనట - నేపాల్ కు చెందిన బాలిక రికార్డ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Kovvuru Railway Station : కొవ్వూరు ప్రజలకు శుభవార్త; మంగళవారం నుంచి ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్!
కొవ్వూరు ప్రజలకు శుభవార్త; మంగళవారం నుంచి ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్!
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Embed widget