YS Jagan Security: మాజీ సీఎం జగన్ నివాసం, వైసీపీ సెంట్రల్ ఆఫీసు వద్ద నిఘా పెంచిన పోలీసులు - మ్యాటర్ ఏంటంటే
CC Cameras At Jagan House | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంతో పాటు వైసీపీ ఆఫీసు వద్ద పోలీసులు రక్షణ ఏర్పాట్లు చేపట్టారు. ఫిబ్రవరి 5న వైసీపీ కార్యాలయం పక్కనే అగ్నిప్రమాదం జరగడం తెలిసిందే.

Andhra Pradesh News | తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ సెంట్రల్ ఆఫీసుతో పాటు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన వైసీపీ అధినేత జగన్ నివాసం పక్కనున్న వైసీపీ ఆఫీసు ప్రాంగణంలోని గార్డెన్‌లో గడ్డి తగలబడి అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ నేతలు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా వైసీపీ ఆఫీసు వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను ఇవ్వాలని పోలీసులు పార్టీ ఆఫీసు సిబ్బందిని కోరారు. కానీ పార్టీ ఆఫీసు నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. దాంతో మాజీ సీఎం జగన్‌కు భద్రత చర్యల్లో భాగంగా నిఘా పటిష్టం చేస్తున్నారు. తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద, పార్టీ ఆఫీసు వద్ద మొత్తం 8 వరకు సీసీ కెమెరాలను పోలీసులు ఆదివారం ఏర్పాటు చేయించారు. ఈ సీసీ కెమెరాలను తాడేపల్లి పోలీస్ స్టేషన్‌కు అటాచ్ చేశారు. పీఎస్ నుంచి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు మానిటర్‌కు లింక్ చేశారు.
వైసీపీ ఆఫీసుకు పోలీసుల నోటీసులు
మాజీ సీఎం జగన్ నివాసం సమీపంలో వైసీపీ ఆఫీసు ప్రాంగణంలోని గార్డెన్‌లో ఫిబ్రవరి 5న గడ్డి తగలబడి మంటలు చెలరేగడంపై పోలీసుల విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి ఆ మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను తాడేపల్లి పోలీసులు సేకరిస్తున్నారు. వైసీపీ ఆఫీసుకు నోటీసుల సైతం ఇచ్చారు. కేసు దర్యాప్తులో భాగంగా పార్టీ ఆఫీసు, జగన్ నివాసం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీ తమకు సమర్పించాలని నోటీసులలో సూచించారు. మరోవైపు అగ్నిప్రమాదం జరిగిన చోట బూడిద, మట్టి నమూనాలను సైతం సేకరించిన పోలీసులు పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపారు. అనుకోకుండా ఇది జరిగిందా, లేక ఎవరైనా ప్లాన్ ప్రకారం చేశారా అని అన్ని కోణాల్లో తాడేపల్లి పోలీసుల కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ నిఘా పటిష్టం చేసేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

