Chiranjeevi Anil Ravipudi Movie: అనిల్ రావిపూడితో సినిమా అనౌన్స్ చేసిన చిరంజీవి.. హారర్ హిట్స్ ఇచ్చిన అమ్మాయికి పోలీస్ రోల్
మెగాస్టార్ చిరంజీవి నుండి మరో లీక్ వచ్చేసింది. విశ్వక్సేన్ లైలా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. తన తదుపరి సినిమా అనిల్ రావిపూడితోనే అని కన్ఫర్మ్ చేసేశారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే..

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘లైలా’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ‘లైలా’ సినిమా టీమ్‌ని అభినందించిన చిరంజీవి.. ఈ సినిమా నిర్మాతే తన తదుపరి సినిమాకు నిర్మాత అని చెబుతూ.. అనిల్ రావిపూడితో సినిమాను అఫీషియల్‌గా ప్రకటించేశారు.
ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. ‘‘ఫ్యూచర్‌లో, అతి సమీపంలో యంగ్ ప్రొడ్యూసర్ సాహు నిర్మాతగా.. ఇప్పుడే పెద్ద బ్లాక్‌బస్టర్ ఇచ్చి, ఆనందంలో సెలబ్రేషన్స్ మీద సెలబ్రేషన్స్ కొనసాగుతున్నటువంటి మా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నేనొక సినిమా చేయబోతున్నాను. ఇది మెగా అనౌన్స్‌మెంట్. ఇది రిలీజ్ ఎప్పుడు, ఏంటనేది మరో లీక్‌లో చెబుతాను. సినిమా సమ్మర్‌లో ప్రారంభం అవుతుంది. సినిమా ఆద్యంతం కామెడీగా ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత ఫుల్‌ప్లెజ్డ్ కామెడీతో ఉంటుంది. ఎప్పుడెప్పుడు సెట్స్‌కి వెళతానా, ఎప్పుడు నటిస్తానా? అనే ఉత్సాహంతో ఉన్నాను. అనిల్ ఇంటికి వచ్చి సీన్స్ చెప్పినప్పుడల్లా పగలబడి నవ్వుతున్నాం. అంత బాగా కథ ఉంది. కచ్చితంగా మా కాంబినేషన్‌లో.. ఇంతకు ముందు కోదండరామిరెడ్డితో బంధం ఎలా అయితే కొనసాగిందో.. అదే ఫీల్ అనిల్ రావిపూడితో కలిగింది. కథకి కెమిస్ట్రీ తోడయితే కచ్చితంగా సినిమా ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతుందని నాకు నమ్మకం ఉంది. సాహుతో కలిసి గోల్డ్ బాక్స్ కొణిదెల సుస్మిత ఈ సినిమాను నిర్మిస్తారు’’ అని చెప్పారు.
Also Read: పవన్ కళ్యాణ్‌ను సీఎం చేసిన ఆహా - జనసేనాని మీద అల్లు అరవింద్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో...
హారర్ హిట్స్ ఇచ్చిన అమ్మాయికి పోలీస్ రోల్
‘లైలా’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన కామాక్షి భాస్కర్ల గురించి మాట్లాడే సమయంలో.. తమ తదుపరి సినిమాలో కామాక్షికి ఓ రోల్ ఉన్నట్లుగా చిరు రివీల్ చేశారు. ‘మా ఊరి పొలిమేర, పొలిమేర 2’ సినిమాలలో కథానాయికగా... ‘విరూపాక్ష’లో ఒక కీలక పాత్ర చేసిన కామాక్షి భాస్కర్లకు తమ సినిమాలో పోలీస్ ఆఫీసర్ రోల్ ఇస్తే బాగుంటుందని అనిల్ రావిపూడి తనతో చెప్పినట్లు మెగాస్టార్ ఈ వేదికపై తెలిపారు.
Also Read: జీ తెలుగు సీరియల్స్... మళ్ళీ సేమ్ టైమింగ్స్‌లో... ప్రతి రోజూ ఏది ఏ టైంలో వస్తుందో తెలుసుకోండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

