Zee Telugu Serials Timings: జీ తెలుగు సీరియల్స్... మళ్ళీ సేమ్ టైమింగ్స్‌లో... ఏది ఏ టైంలో వస్తుందో తెలుసుకోండి
Zee Telugu Serials Timings 2025 - Changed Again: జీ తెలుగు సీరియల్ టైమింగ్స్ మళ్లీ మారాయి. కొన్ని రోజుల క్రితం టైమింగ్స్ మారాయి. అదీ క్రికెట్ కోసం! కానీ, ఇప్పుడు మళ్ళీ సేమ్ టైమింగ్స్‌లోకి వచ్చేశాయి.

'జీ తెలుగు' (Zee Telugu TV)కు తెలుగు బుల్లితెర వీక్షకుల్లో మంచి ఆదరణ ఉంది. తెలుగు టీవీ ఆడియన్స్ ఫేవరేట్ సీరియళ్లు ఆ ఛానల్‌లో చాలా ఉన్నాయి. ప్రతి సాయంత్రం ఆ సీరియల్స్ కోసం టీవీ ముందు కూర్చునే జనాలకు జనవరిలో షాక్ తగిలింది. క్రికెట్ లైవ్ టెలికాస్ట్ కోసం సీరియల్స్ టైమింగ్స్ ఛేంజ్ చేసింది 'జీ తెలుగు'. మళ్ళీ ఇప్పుడు సేమ్ టైమింగ్స్, టైమ్ స్లాట్స్‌లో సీరియల్స్ టెలికాస్ట్ చేయనుంది.
'జీ తెలుగు'లో ఏ సీరియల్ ఏ టైంలో వస్తుంది?
Zee Telugu HD Serial Timings: జనవరి 10వ తేదీ... అంటే సోమవారం నుంచి 'జీ తెలుగు'లో సీరియల్ టైమింగ్స్ మళ్ళీ మారుతున్నాయి. ఎప్పటిలా సేమ్ టైమింగ్స్‌లో వస్తాయని జీ తెలుగు పేర్కొంది. ఏ టైంలో ఏ సీరియల్ వస్తుంది? అనే షెడ్యూల్ చూడండి.
| నంబర్ | సీరియల్ పేరు | టెలికాస్ట్ టైమింగ్ |
| 1 | చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి | సాయంత్రం 6 గంటలకు |
| 2 | మా అన్నయ్య | సాయంత్రం 6:30 గంటలకు |
| 3 | నిండు నూరేళ్ల సావాసం | రాత్రి 7 గంటలకు |
| 4 | మేఘ సందేశం | రాత్రి 7:30 గంటలకు |
| 5 | పడమటి సంధ్యారాగం | రాత్రి 8 గంటలకు |
| 7 | చామంతి (కొత్త సీరియల్) | రాత్రి 8:30 గంటలకు |
| 8 | జగద్ధాత్రి | రాత్రి 9 గంటలకు |
| 9 | అమ్మాయి గారు | రాత్రి 9:30 గంటలకు |
| 10 | ప్రేమ ఎంత మధురం | రాత్రి 10 గంటలకు |
ఫిబ్రవరి రెండో వారం వరకు ఏ టైంలో టెలికాస్ట్ చేశారంటే?
టైమింగ్స్ మారిన తర్వాత జనవరి రెండో వారం నుంచి ఫిబ్రవరి రెండో వారం వరకు సుమారు 30 రోజులు పాటు సీరియల్ ఏ ఏ టైమింగ్స్ లో టెలికాస్ట్ అయ్యాయో తెలుసా?
ప్రతి రోజు రాత్రి 10 గంటలకు టెలికాస్ట్ అవుతుంది 'ప్రేమ ఎంత మధురం'. దానిని ఉదయం 11:30 గంటలకు టెలికాస్ట్ చేశారు. అలాగే, రాత్రి 8 గంటలకు వచ్చే 'పడమటి సంధ్యారాగం' సాయంత్రం 4 గంటలకు, రాత్రి 7:30 గంటలకు టెలికాస్ట్ అయ్యే ''మేఘ సందేశం'ను మధ్యాహ్నం మూడున్నర గంటలకు, అలాగే రాత్రి 8 గంటలకు టెలికాస్ట్ అవుతున్న కొత్త సీరియల్ 'చామంతి'ని సాయంత్రం 4:30 గంటలకు, అలాగే 'జగద్ధాత్రి'ని సాయంత్రం ఐదు గంటలకు, 'అమ్మాయి గారు'ను సాయంత్రం ఐదున్నర గంటలకు టెలికాస్ట్ చేసింది. ఇప్పుడు యధావిధిగా ఆయా సీరియళ్లను ప్రసారం చేయడానికి రెడీ అయింది జీ తెలుగు.
Also Read: పల్లవి గౌడ డబుల్ ధమాకా... జీ తెలుగు సీరియల్ 'నిండు నూరేళ్ళ సావాసం'లో ట్విస్ట్ తెలిసిందా?





















