Star Maa Serials TRP Ratings: టీఆర్పీ రేటింగుల్లో గుడిగంటలు గట్టిగా మోగాయ్... స్టార్‌మా, జీ తెలుగులో ఈ వారం టాప్ 10 లిస్ట్ - ఏయే సీరియల్స్ ఉన్నాయో చూశారా?
Telugu Serials TRP Ratings: టీఆర్పీలో ప్రతి వారం నంబర్1 స్థానంలో నిలుస్తున్న 'కార్తీక దీపం 2'కు 'గుండె నిండా గుడిగంటలు' డేంజర్ బెల్స్ మోగించింది. ఈ వారం టాప్ 10 లిస్టులో ఏయే సీరియళ్లు ఉన్నాయో చూడండి.

Telugu TV serials TRP ratings this week - Check top 10 list: బుల్లితెర వీక్షకులలో 'కార్తీక దీపం నవ వసంతం' సీరియల్ పట్ల ఆదరణ తగ్గలేదు. కానీ, ఇతర సీరియళ్లు సైతం డాక్టర్ బాబు (నిరుపమ్ పరిటాల), వంటలక్క (ప్రేమి విశ్వనాథ్) సీరియల్‌కు ధీటుగా సత్తా చాటుతున్నాయి. టీఆర్పీ రేటింగ్స్ విషయంలో కొన్ని వారాలుగా తన నెంబర్ వన్ స్థానం నిలుపుకొంటున్న 'కార్తీక దీపం 2'కు డేంజర్ బెల్స్ మరోసారి మోగాయి. 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్ ఈ వారం స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చింది. దాంతో చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు కొసరంత మార్జిన్ మీద 'కార్తీక దీపం 2' టాప్ ప్లేస్ నిలబెట్టుకుంది. ఈ ఏడాది (2025లో) జనవరి 4వ వారంలో సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయి? టాప్ 10 స్థానాల్లో ఏయే సీరియల్స్ ఉన్నాయి? అనేది చూస్తే...
గుండె నిండా గుడిగంటలు...
అసలు తక్కువ అంచనా వేయొద్దు!
ఒక్క వారం కాదు... గత కొన్ని వారాలుగా బుల్లితెర మీద డాక్టర్ బాబు జైత్ర యాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. ప్రతి వారం టీఆర్పీ రేటింగ్స్ చూస్తే మొదటి స్థానంలో ఆ సీరియల్ ఉంటుంది. ఈ వారం కూడా 'కార్తీక దీపం 2' ఉంది. అది జస్ట్ 0.01% తేడాతో ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకుంది. లేదంటే 'గుండె నిండా గుడిగంటలు' మొదటి స్థానంలో ఉండేది. 'స్టార్ మా' ఛానల్ సీరియళ్లలో ఈ వారం ఏ సీరియల్ ఎంత టీఆర్పీ అందుకుంది? అనేది చూస్తే...
జనవరి నాలుగో వారంలో, 2025లో టీఆర్పీ రేటింగ్స్ పరంగా టాప్ టెన్ లిస్ట్ చూస్తే 'కార్తీక దీపం నవ వసంతం' మొదటి స్థానంలో ఉంది. దానికి 9.99 టీఆర్పీ వచ్చింది. ఆ వెంటనే 9.98 టీఆర్పీతో 'గుండె నిండా గుడి గంటలు' రెండో స్థానంలో నిలిచింది.
మిగతా సీరియల్స్ విషయానికి వస్తే... బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, సీనియర్ హీరోయిన్ ఆమని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' 9.38 రేటింగ్ అందుకుంది. ఆ తర్వాత 'ఇంటింటి రామాయణం' (8.87), 'నువ్వుంటే నా జతగా' (7.95), 'చిన్ని' (7.92), 'మగువా ఓ మగువా' (6.40), 'గీత ఎల్ఎల్‌బి' (4.87), 'సత్యభామ' (3.29) టీఆర్పీ రేటింగ్ సాధించాయి.
మానస నాగులపల్లి, దీపికా రంగరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'బ్రహ్మముడి' సీరియల్ ఈ వారం 6.05 టీఆర్పీ సాధించింది. టైమింగ్ మధ్యాహ్ననానికి మారిన తర్వాత టీఆర్పీ పరంగా కింద పడినా... మళ్ళీ ఆ సీరియల్ పుంజుకుంది.
'జీ తెలుగు'లో ఈ వారం టాప్ 'జగద్ధాత్రి'
జీ తెలుగు సీరియళ్లలో 'మేఘ సందేశం' కొన్ని వారాల పాటు దుమ్ము దులిపింది. ఆ సీరియల్ ఈ వారం టాప్ ప్లేసులో లేదు. 7.57 టీఆర్పీ 'జగద్ధాత్రి' మొదటి స్థానంలో నిలిచింది. 'మేఘ సందేశం' సీరియల్ ఈ వారం రెండవ స్థానంలో కూడా నిలవలేదు. 'పడమటి సంధ్యారాగం' 7.40 టీఆర్పీతో సెకండ్ ప్లేస్ సొంతం చేసుకోగా... 7.18 టీఆర్పీతో 'చామంతి', 'మేఘ సందేశం' సీరియల్స్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
Also Read: ఎస్వీఆర్ మనవడితో ఎంట్రీ... సీఎం కొడుకుతో సినిమా... ప్రియాంకా చోప్రా మరదలు టాలీవుడ్ హీరోయినే
జీ తెలుగులో మిగతా సీరియల్స్ విషయానికి వస్తే... 'అమ్మాయి గారు' (6.60), 'నిండు నూరేళ్ల సావాసం' (6.25), 'ప్రేమ ఎంత మధురం' (4.88), 'మా అన్నయ్య' (4.68), 'చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి' (3.01) టీఆర్పీ సాధించాయి.
ఇప్పుడు మధ్యాహ్నం టెలికాస్ట్ అవుతున్న 'ఉమ్మడి కుటుంబం' 3.44 టీఆర్పీ సాధించింది. 'జీ తెలుగు'లో కొత్తగా మొదలైన 'ఎన్నాళ్లో వేచిన హృదయం' 3.36 టీఆర్పీ సాధించింది.
జెమినీ టీవీలో ఈ వారం సింగిల్ డిజిట్ టీఆర్పీ సాధించిన సీరియల్ ఒక్కటి కూడా లేదు. గత వారం ఈటీవీలో రెండు సీరియళ్లు రెండు కంటే ఎక్కువ టీఆర్పీ సాధించాయి. ఈ వారం 'మనసంతా నువ్వే' 2.35 టీఆర్పీ సాధించగా... 'రంగుల రాట్నం' 2.41 టీఆర్పీ సాధించింది. కొత్త సీరియల్ 'ఝాన్సీ'కి 1.91 టీఆర్పీ వచ్చింది. 'బొమ్మరిల్లు' (1.74), 'శతమానం భవతి' (1.63), 'కలిసుందాం రా' (1.13) టీఆర్పీ తెచ్చుకున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

