అన్వేషించండి

Neelam Upadhyaya: ఎస్వీఆర్ మనవడితో ఎంట్రీ... సీఎం కొడుకుతో సినిమా... ప్రియాంక మరదలు టాలీవుడ్ హీరోయినే

Priyanka Chopra's Sister In Law: తమ్ముడు సిద్ధార్థ్ పెళ్లి పనుల్లో ప్రియాంక చోప్రా బిజీ బిజీగా ఉన్నారు. ఇంతకీ, ఆవిడ మరదలు ఎవరో తెలుసా? టాలీవుడ్ హీరోయిన్. నీలమ్ ఉపాధ్యాయను గుర్తు పట్టారా?

ప్రియాంక చోప్రా ఇంట పెళ్లి సందడి నెలకొంది. స్టార్ హీరోయిన్ తమ్ముడు సిద్ధార్థ్ చోప్రా, హీరోయిన్ నీలమ్ ఉపాధ్యాయ వివాహ బంధంతో ఒక్కటి అవుతున్నారు. ఈ పెళ్లితో నీలమ్ పేరు ముంబై సినిమా సర్కిళ్లలో పాపులర్ అవుతోంది. ఆవిడ ఎవరు? అని ఆరాలు తీయడం మొదలు పెట్టారు.
 
డేటింగ్ యాప్ 'బంబుల్'లో తన తమ్ముడు సిద్ధార్థ్ చోప్రా, నీలమ్ ఉపాధ్యాయ ఒకరికొకరు పరిచయం అయ్యారని ప్రియాంక చోప్రా తెలిపారు. ఈ పెళ్లి వల్ల ఉత్తరాది ప్రేక్షకులకు నీలమ్ గురించి తెలుస్తోంది. అంత కంటే ముందు ఆవిడ తెలుగులో పాపులర్ అని తెలుసా? తెలుగులో కథానాయికగా ఆవిడ సినిమాలు చేశారు. 

ఎస్వీఆర్ మనవడితో నీలమ్ ఎంట్రీ
నీలమ్ ఉపాధ్యాయది ముంబై. బాలీవుడ్ రాజధానిలో జన్మించిన ఆ అమ్మాయి, ఎంఎంకే కాలేజీలో చదువుకున్నారు. యాక్టింగ్, మోడలింగ్ మీద ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించారు. తొలుత ఒక తమిళ సినిమాలో నటించే అవకాశం వచ్చినా ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. తర్వాత తెలుగులో కథానాయికగా ఆవిడ ఎంట్రీ ఇచ్చారు. 

ఎస్వీ రంగారావు మనవడు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఒకట్రెండు సినిమాలు చేశాక కనుమరుగు అయ్యారు. ఎస్వీఆర్ మనవడు, జూనియర్ ఎస్వీ రంగారావు హీరోగా నటించిన 'మిస్టర్ 7'తో నీలమ్ ఉపాధ్యాయ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. కథానాయికగానూ ఆవిడకు అదే మొదటి సినిమా. తర్వాత మరికొన్ని సినిమాలు చేశారు. 

'అల్లరి' నరేష్ 'యాక్షన్ త్రీడీ'లోనూ...
'మిస్టర్ 7' విజయం సాధించలేదు. అయినా నీలమ్ ఉపాధ్యాయకు అవకాశాలు వచ్చాయి. నిర్మాత అనిల్ సుంకర దర్శకత్వం వహించిన 'యాక్షన్ త్రీడీ'లో 'అల్లరి' నరేష్ జంటగా ఆవిడ నటించారు. ఆ సినిమాలో 'స్వాతిముత్యపు జల్లులు' సాంగ్ రీమిక్స్ చేశారు. ఆ పాటలో నీలమ్ ఉపాధ్యాయ గ్లామర్ హైలైట్ అయ్యింది. ఆ తర్వాత తమిళంలోనూ రెండు సినిమాలు చేశారు ఆవిడ. 

సీఎం కొడుకుతోనూ నటించిన నీలమ్!
నీలమ్ ఉపాధ్యాయకు సీఎం కొడుకుతోనూ నటించిన ట్రాక్ రికార్డ్ ఉంది. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నారా రోహిత్ కొడుకు వరుస అవుతారని తెలుసు కదా! నారా రోహిత్ సరసన 'పండగలా వచ్చాడు' సినిమాలో నీలమ్ ఉపాధ్యాయ నటించారు. అయితే, ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఎప్పుడో 2018లో థియేటర్లలోకి రావాల్సిన సినిమా. అనివార్య కారణాల వల్ల ఆగింది. అదొక్కటే కాదు... మరొక తెలుగు సినిమా కూడా నీలమ్ ఉపాధ్యాయ పూర్తి చేసింది. అదీ విడుదల కాలేదు.

Also Read: హాయ్ నాన్న... కన్నడ సినిమాకు కాపీనా? కన్నడ నిర్మాత ఇన్‌స్టా స్టోరీ గొడవ ఏంటి?


హిందీలో హీరోయిన్ కాకుండా పాపులారిటీ!
తెలుగులో నాలుగు సినిమాల్లో నటించిన నీలమ్ ఉపాధ్యాయ హిందీలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ, ఆవిడ పాపులర్ అయ్యింది. అందుకు రీజన్ సిద్ధార్థ్ చోప్రాతో పెళ్లి. ప్రియాంకా చోప్రాకు మరదలు కావడం. అసలు 2018 తర్వాత నీలమ్ ఉపాధ్యాయ సినిమాలే చేయలేదు. గతేడాది (2024) ఆగస్టులో సిద్ధార్థ్ చోప్రాతో ఆమె నిశ్చితార్థం జరిగింది. అంతకు ముందు వాళ్లిద్దరూ కలిసి కనిపించినా... ఆ తర్వాత ఎక్కువగా కనిపించడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఫిబ్రవరి మొదటి వారంలో పెళ్లి చేసుకుంటున్నారు.

Also Read: వెండితెరకు రాజకీయ రంగులు... తెలుగులో బెస్ట్ పొలిటికల్ ఫిలిమ్స్ - 'గేమ్ చేంజర్'కు ముందు... మీరెన్ని చూశారు?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget