పదేళ్ల తెలంగాణకు మేమిచ్చే ట్రిబ్యూట్ సదరన్ రైజింగ్ సమ్మిట్ - ఏబీపీ డైరెక్టర్ ధ్రుబ ముఖర్జీ
ABP Southern Rising Summit 2024: పదేళ్ల తెలంగాణకు ఏబీపీ న్యూస్ నెట్ వర్క్ ఇస్తున్న ట్రిబ్యూటే ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024 (ABP Southern Rising Summit 2024 Hyderabad) ఈవెంట్ అన్నారు ఏబీపీ న్యూస్ డైరెక్టర్ ధ్రుబ ముఖర్జీ. ’’దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ, కర్ణాటకలో ఎక్కువ అభివృద్ధి కనిపిస్తోంది. సదరన్ రైజింగ్ సమ్మిట్ హైదరాబాద్‌లో నిర్వహించడానికి కారణం ఇదే. పదేళ్ల తెలంగాణకి ఈ సమ్మిట్ ఓ నివాళిగా భావిస్తున్నాం. ఏబీపీ నెట్‌వర్క్‌ది వందేళ్ల చరిత్ర. మూడేళ్ల క్రితం మొదలైన ఏబీపీ దేశంపై అందరూ చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు’’ అని ధ్రుబ ముఖర్జీ, డైరెక్టర్, ఏబీపీ నెట్‌వర్క్ అన్నారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024 (CM Revanth Reddy ABP Southern Rising) ఈవెంట్లో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణిని కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్నదని అన్నారు.