Megastar Chiranjeevi Comments Controversy | చిరంజీవి నోరు జారుతున్నారా..అదుపు కోల్పోతున్నారా.? | ABP Desam
మెగాస్టార్ చిరంజీవి. ఆయన నటనను వేలు పెట్టి చూపించలేం. ఆయన స్థాయి ఎవరెస్ట్ అంత ఎత్తు. ప్రస్తుతం వశిష్ఠతో విశ్వంభర సినిమా చేస్తున్న చిరంజీవి...నెక్ట్స్ లైన్ లో అనిల్ రావిపూడిని, శ్రీకాంత్ ఓదెలను పెట్టారు. ఇంత బిజీ షెడ్యూల్ లోనూ తెలుగు ఇండస్ట్రీ బాగుండాలని మొన్న లైలా, నిన్న బ్రహ్మా ఆనందం సినిమా ఫంక్షన్లకు వచ్చారు చిరంజీవి. అయితే మెగాస్టార్ మాట్లాడిన కొన్ని మాటలు వైరల్ అవుతున్నాయి.
లైలా ఫంక్షన్ లో విశ్వక్ సేన్ కోసం వచ్చిన చిరంజీవి...బాలయ్య కాంపౌండ్ హీరో కోసమే తను వచ్చానంటే ఇండస్ట్రీలో కాంపౌండ్లు ఉండవు అనే బలమైన సందేశాన్ని ఇచ్చారు. నిన్న బ్రహ్మా ఆనందం ఈవెంట్లోనూ అంతే. బ్రహ్మానందం అంటే తన ఫ్యామిలీ మెంబర్ అని బ్రహ్మానందం కొడుకు అంటే హీరో అంతే...తన గ్లామర్ ఆ కుర్రాడికి ఉపయోగపడితే అంతకంటే కావాల్సింది ఏముంది అంటూ తన పెద్ద మనసు చాటుకున్నారు. అయితే ఈ రెండు ఈవెంట్స్ లోనూ చిరంజీవి కొన్ని మాటలు కాంట్రవర్సీగా మారాయి.
లైలా ఫంక్షన్ లో పద్మవిభూషణ్ వచ్చింది కాబట్టి పెద్దరికంగా ఉండాలని అనుకుంటున్నా కానీ కాస్త ప్రౌఢగా కనిపిస్తున్న లైలా కనిపిస్తే..ఒక్కోసారి చూపు అలా వెళ్లొచ్చంటూ పరిధి దాటి మాట్లాడేశారు చిరంజీవి. ఆ సమయంలో చూసిన చూపు ఆయన చెప్తున్నారో అర్థమయ్యేలా చేసింది.
నిన్న బ్రహ్మా ఆనందం ఫంక్షన్ లో ఇంట్లో పెద్దవాళ్ల ఫోటోలు చూపించి వాళ్ల గురించి చెప్పమన్నప్పుడు బ్రహ్మానందం చాలా పద్ధతిగా వాళ్ల పెద్దవాళ్ల గురించి చెప్పారు. కానీ చిరంజీవి కాస్త నోరు జారారు. తన తాత రసికుడని ఇంట్లోనే తనకు ఇద్దరు అమ్మమ్మలు ఉండేవాళ్లని...ఆ తర్వాత కాలంలో మూడో ఆవిడని కూడా ఓదార్చారని..ఇంక బయట ఎన్నున్నాయో తెలియదని నాలుగైదు కూడా ఉండొచ్చని అన్నారు. ఇది తన కుటుంబాన్ని తనే పలుచన చేసుకోవటం అని మెగా ఫ్యాన్సే ఫీలవుతున్నారు.
ఇక్కడితో ఆగకుండా ఇంట్లో తన మనవరాళ్లతో నిండిపోతోందని ఒక్కడంటే ఒక్కడు కూడా అబ్బాయి లేడని..తన పరిస్థితి చూస్తుంటే తనకు తనే లేడీస్ హాస్టల్ వార్డెన్ లా ఉంటోందని చెప్పారు. తన లెగసీని కంటిన్యూ చేయాలంటే చరణ్ కు ఓ అబ్బాయిని కనివ్వరా అని చెప్పాలనుందని మళ్లీ అమ్మాయి పుట్టేస్తుందేమోనని భయం కూడా ఉందని చెప్పారు చిరంజీవి. ఇది లైటర్ వే లోని చెప్పి ఉండొచ్చు కానీ ఈ రోజుల్లో కూడా ఇంకా అమ్మాయి అబ్బాయి
అని చూసుకోవడం ఏంటీ..పైగా చిరంజీవి లాంటి స్థాయి ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా అనేది సగటు అభిమాని ఆవేదన..





















