మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతి
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 100 ఫీట్ రోడ్‌పై మితిమీరిన వేగంతో వచ్చిన బైక్..రోడ్ డివైడర్‌ని ఢీకొట్టింది. ఈ ధాటికి బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అమాంతం ఎగిరి పడ్డారు. రోడ్డుపై పడడం వల్ల తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిలో ఒకరు
అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయారు. బోరబండ నుంచి మాదాపూర్ వస్తుండగా..పర్వతానగర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బైక్‌ని వేగంగా నడపడం వల్ల ఒక్కసారిగా కంట్రోల్ తప్పింది. నేరుగా డివైడర్‌ని ఢీకొట్టింది. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు..విచారణ చేపడుతున్నారు. అయితే..ఈ యాక్సిడెంట్‌కి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరూ హెల్మెట్‌లు పెట్టుకోకుండా బైక్ వేగంగా నడపడం వల్ల ఇంత దారుణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంలో బైక్ చాలా దూరంగా పడిపోయింది. ఆ వేగానికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు.