Viral News: మహిళ ఇంటి ముందు బ్యాంక్ అధికారుల వినూత్న నిరసన, వంటావార్పుతో అంతా షాక్
Janagama News | తీసుకున్న లోన్ పెండింగ్ నగదు కట్టాలని బ్యాంక్ అధికారుల వంటావార్పుతో వినూత్న నిరసన తెలిపిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. ఇది చూసి స్థానికులు షాకయ్యారు.

Woman publicly humiliated by Bank officials | వరంగల్: ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తీసుకున్న వ్యక్తులు సమయానికి అప్పు కట్టకుంటే పరిస్థితి దారుణంగా ఉంటుంది. నిర్వాహకులు పంపే సిబ్బంది లోన్ తీసుకున్న వారి ఇంటికి వెళ్లి నిలదీయడంతోపాటు ఒత్తిడి చేస్తారు. కానీ బ్యాంకు అధికారులు సైతం మొండి బకాయిలను వసూలు చేసుకోవడానికి అప్పుతీసుకున్న వారి ఇంటికి వెళ్లి లోన్ బకాయిలు కట్టాలని ఒత్తిడి పెంచడంతో పాటు వినూత్న ఆందోళనలు దిగుతున్నారు. ఇలాంటి సంఘటనే జనగామ జిల్లాలో జరిగింది.
అప్పు కట్టలేదని వినూత్న నిరసన
లోన్ డబ్బులు వసూలు చేసుకోవడానికి బ్యాంక్ అధికారులు వినూత్న నిరసన చేపట్టారు. బ్యాంకులో అప్పు కట్టలేదని ఇంటి ముందు పొయ్యి పెట్టారు. ఈ ఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దతండా లో చోటు చేసుకుంది. పెదతండాకు చెందిన గుగులోత్ లక్ష్మి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మహిళా సంఘంలో రుణం తీసుకొంది. ఇంకా 61 వేలు అప్పు పెండింగ్ ఉంది. లక్ష్మి అప్పు కట్టకపోవడంతో అధికారులు, మహిళ సంఘం మహిళలతో కలిసి లోన్ పెండింగ్ నగదు కట్టాలని గుగులోత్ లక్ష్మి ఇంటి ముందు పొయ్యి పెట్టి బ్యాంక్ అధికారులు వంటావార్పు చేశారు. ఈ రోజు పది వేలు, 28 వ తేదీన 51 వేలు కట్టాలని లేకుంటే బ్యాంక్ అధికారులు, సర్ఫ్ డిపార్ట్ మెంట్ అధికారులు లక్ష్మి ఇంటి ముందు కూర్చొని నిరసన తెలుపుతారని బ్యాంక్ అధికారి హెచ్చరించారు.
అంతే కాకుండా గ్రామంలోని రాజయ్య అనే వ్యక్తి కూడా లోన్ నగదు కట్టక పోవడంతో ఆయన ఇంటి ముందు కూర్చోని నిరసన తెలిపారు. అయితే ఈ ఘటన ఈనెల 24 వ తేదీన జరగగా ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.
Also Read: Road Accident: వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం- ఆటోలు, కారుపై లారీ బోల్తా పడి ఐదుగురు దుర్మరణం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

