SS Rajamouli Post on Mahesh Babu | ఒక్క పోస్ట్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి | ABP Desam
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచరెస్ సినిమా తీస్తున్న ఎస్ ఎస్ రాజమౌళి...నిన్న రాత్రి పెట్టిన ఒక అప్డేట్ తో సోషల్ మీడియాను షేక్ చేశాడు. రీజన్ ఏంటంటే ఆ పోస్ట్ కి వస్తున్న రెస్పాన్స్. బాబ్ ని బంధించాను పాస్ పోర్ట్ లాగేసుకున్నాను అని ఓ కన్నింగ్ స్మైల్ ఇస్తూ రాజమౌళి వీడియో పెడితే...దానికి సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా స్పందించటం హైలెట్. పోకిరీ సినిమాలోని డైలాగ్ పెట్టాడు మహేశ్ బాబు కామెంట్ గా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని. మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్ అయితే క్లాప్స్ ఎమోజీస్ పెట్టారు. దాని అర్థం ఇప్పటికైనా బాబును లాక్ చేశారు షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారని. అయితే ఊహించని సర్ ప్రైజ్ ఏంటంటే ప్రియాంకా చోప్రా పెద్ద లీక్ ఇచ్చారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను తీసుకుంటున్నారని కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతోంది. RRR తో హాలీవుడ్ లో భారీ క్రేజ్ సంపాదించుకున్న రాజమౌళి...మహేశ్ సినిమాను ముందు నుంచే ప్యాన్ వరల్డ్ రేంజ్ లో తీస్తున్నారని అర్థమవుతోంది. మరి హాలీవుడ్ రేంజ్ సినిమాలో హాలీవుడ్ జనాలకు తెలిసిన అమ్మాయి హీరోయిన్ అయితే బాగుంటుందని భావించారో ఏమో ప్రియాంకచోప్రాను తీసుకుని ఉంటారని అర్థం అవుతోంది. బేవాచ్ సిరీస్ ద్వారా తన భర్త, సింగర్ నిక్ జోనస్ ద్వారా హలీవుడ్ ప్రేక్షకులకు ప్రియాంక చోప్రా పరిచయమే. అయితే ప్రియాంక చోప్రా మహేశ్ తో యాక్ట్ చేస్తున్నారనే విషయం ఇంకా అఫీషియల్ కన్ఫర్మ్ కాలేదు. కొన్ని రోజులుగా ఆమె హైదరాబాద్ లోనే ఉంటున్నారు. చిలుకూరు బాలాజీ టెంపుల్, కామారెడ్డి దగ్గర ఉపాసస వాళ్లకు సంబధించిన ఆలయాలను సందర్శించుకున్న ప్రియాంక ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు నిన్న రాజమౌళి పెట్టిన సీజ్ ది లయన్ పోస్ట్ కు ప్రియాంక చోప్రా ఫైనల్లీ అని కామెంట్ పెట్టారు. జనరల్ గా మహేశ్, రాజమౌళి పోస్టులకు సెలబ్రెటీలు కామెంట్ పెట్టడం పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు కానీ రాజమౌళి పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ప్రియాంక చోప్రా కామెంట్ పెట్టడంతో ఆమె సినిమాలో హీరోయిన్ అన్ కన్ఫర్మ్ చేసేసుకుంటున్నారు ఫ్యాన్స్.





















