AP Republic Day 2025 Celebrations: విజయవాడలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు, జాతీయ పతాకం ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
విజయవాడలో ఘనంగా 76వ రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.

AP Republic Day 2025 Celebrations: విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించింది. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకం ఆవిష్కరించారు. అంతకుముందు పరేడ్ లో పాల్గొని గవర్నర్ అబ్దుల్ నజీర్ పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. ఈ రిపబ్లిక్ డే వేడుకలలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
తిరుమలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయమైన గోకులం విశ్రాంతి భవనం ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవాన్ని టీటీడీ నిర్వహించింది. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం 7 గంటలకు జాతీయ జెండాను అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఎగురవేస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమలలో విధులు నిర్వహించే వివిధ విభాగాధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.
రిపబ్లిక్ డే పరేడ్ శకటాల్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ శకటానికి తృతీయ స్థానం దక్కింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ నుంచి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ పురస్కారం స్వీకరించారు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

