MPs Dance: పెళ్లి వేడుకలో ముగ్గురు మహిళా ఎంపీల డాన్స్ వైరల్ - రాజకీయం అంటే ఇదే !
Mahua Moitra: రాజకీయ నాయకులు కెమెరా ముందు శత్రువులు, వెనుక స్నేహితులు. నవీన్ జిందాల్ కూతురు వివాహంలో మహువ మొయిత్రా, సుప్రియా సూలే, కంగన రనౌత్ డ్యాన్స్ వీడియో వైరల్ అయింది.

Women MP dance goes viral: రాజకీయ పార్టీల మధ్య తీవ్ర విభేదాలు, వివాదాలు అన్నీ రాజకీయంగానే ఉంటాయి. వ్యక్తిగతంగా ఉండవు. ఈ విషయం ఒక వైరల్ వీడియో ద్వారా మరోసారి నిరూపితమయింది.
బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ కూతురు యశస్విని జిందాల్ వివాహ వేడుకల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువ మొయిత్రా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) ఎంపీ సుప్రియా సూలే, బీజేపీ ఎంపీ కంగన రనౌత్ ముగ్గురూ కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది.
Politicians act like enemies on camera and are close friends backstage. Don't be a blind fighter for any political party.
— A K Mandhan (@A_K_Mandhan) December 8, 2025
For all voters who fight for their Political party, here is a video of Mahua Moitra (Trinamool Congress), Supriya Sule (Nationalist Congress Party) and… pic.twitter.com/V7eVflifJQ
బీజేపీ ఎంపీ, జిందల్ స్టీల్ అండ్ పవర్ చైర్మన్ నవీన్ జిందాల్ కూతురు యశస్విని జిందాల్ వివాహం డిసెంబర్ 7న ఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో బాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. వివాహ వేడుకల్లో ఒక రిహార్సల్ స్టేజ్ పెర్ఫార్మెన్స్‌లో మహువ మొయిత్రా, సుప్రియా సూలే, కంగన రనౌత్ ముగ్గురూ ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. వీడియోలో మహువ మొయిత్రా ఎనర్జిటిక్‌గా స్టెప్స్ వేస్తూ కనిపించారు. సుప్రియా సూలే కంగన రనౌత్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో డ్యాన్స్ చేయడం అందర్నీ ఆకట్టుకుంది.
बीजेपी सांसद नवीन जिंदल के घर की शादी में सुप्रिया सुले, महुआ मोइत्रा, कंगना रनौत.. सब एक मंच पर नाच रहे हैं।
— Sushant Sinha (@SushantBSinha) December 7, 2025
नेता जो कर रहे वो बिल्कुल ग़लत नहीं है, ये वीडियो सिर्फ़ इसलिए दिखा रहा हूँ कि आप जो घर और दोस्तों के WhatsApp ग्रुप में नेता-राजनीति के चक्कर में एक दूसरे से संबंध… pic.twitter.com/pz4t0PkKa5
మహువ మొయిత్రా (టీఎంసీ) బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూంటారు. సుప్రియా సూలే (ఎన్‌సీపీ-ఎస్పీ) తండ్రి షరద్ పవార్ బీజేపీని వ్యతిరేకిస్తారు. కంగన రనౌత్ (బీజేపీ) బాలీవుడ్‌లోనూ, రాజకీయాల్లోనూ కాంట్రవర్సీ క్వీన్‌గా ఉంది. అయినప్పటికీ, ఈ ముగ్గురూ వివాహ వేడుకల్లో కలిసి డ్యాన్స్ చేశారు.
Supriya Sule and Mahua Moitra dancing along with Kangana Ranaut at BJP MP Naveen Jindal’s daughter’s wedding
— Veena Jain (@Vtxt21) December 7, 2025
This video is for all those supporters who risk their careers and lives for such leaders 🙌 pic.twitter.com/JsgnoVhDs2
రాజకీయ వివాదాలు ఎప్పుడూ సిద్ధాంతపరంగానే ఉంటాయి. వ్యక్తిగతంగా మాత్రం అందరూ స్నేహితులుగానే ఉండాలి. ఈ మహిళా ఎంపీలు ఆ సంసదేశాన్ని ఇచ్చారు.





















