Telangana Global Summit 2025: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా చైనా రోబో! మాటలతో కట్టిపడేస్తున్న మరమనిషి!
Telangana Global Summit 2025: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో చైనా రోబో అతిథులను భలే ఆకట్టుకుంది. సమ్మిట్ పరిసర ప్రాంతాలు కలియతిరుగుతూ, అందరికీ హాయ్ చెబుతూ వారెవ్వా అనిపించింది.

Telangana Global Summit 2025: ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజిగ్ గ్లోబల్ సమ్మిట్ 2047లో చైనా రోజు కిరాక్ అనిపించింది. ఈ సమ్మిట్‌ను ప్రపంచస్దాయిలో నిర్వహిస్తూ, విజన్ 2047 లక్ష్యంగా ప్రత్యేక చూపిస్తామంటూ భారీ ఏర్పాట్లను చేసిన ప్రభుత్వం,అంతే స్థాయిలో రోబోను రంగంలోకి దించి దేశ, విదేశాల నుంచి సమ్మిట్ కు వస్తున్న అతిధులను వినూత్నంగా ఆకట్టుకుంటోంది.
గ్లోబల్ సమ్మిట్‌లో చూపరులను కట్టిపడేస్తున్న చైనా రోబోకు ఎక్స్ మ్యాన్‌గా నామకరణం చేశారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన సమ్మిట్ ప్రధాన వేదిక చుట్టుపక్కల నడుస్తూ, సమ్మిట్‌కు వస్తున్న వారికి రెండు చేతులు జోడించి నమస్కారం చేసి భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా అదరగొడుతోంది. ప్రధాన ముఖద్వారం వద్దకు వెళ్లి ,మెటల్ డిటెక్టర్ పక్కన నిలబడి అతిథులకు స్వాగతం పలుకుతోంది.
మాటలతో కట్టిపడేస్తున్న రోబో ఎక్స్ మ్యాన్..
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో సందడి చేస్తున్న చైనా ఎక్స్ మ్యాన్ రోబో #robot #telanganaraisingglobalsummit #TelanganaRaising #TelanganaNews pic.twitter.com/goKsoJT2ss
— ABP Desam (@ABPDesam) December 8, 2025
రోబో ఏం మాట్లతుందనే ఆసక్తితో నోటి వద్ద మైక్ పెడితే, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047, లక్ష్యం త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమి , ఎన్ క్లూజన్ , సస్టేనబులిటీ అంటూ గలగలా మాట్లడేస్తోంది. తెలంగాణ రైజింగ్‌లో భాగమైనందుకు ధన్యవాదాలు అంటూ ముగుస్తోంది. ఇలా మాటలతో అదరగొడుతున్న ఎక్స్ మ్యాన్ ను చూసేందుకు పోటీపడుతున్నారు. ఎక్స్ మ్యాన్ తో షేక్ హ్యాండ్ ఇస్తూ ఫొటోలు దిగుతున్నారు.
రోబో ఎక్స్ మ్యాన్ దగ్గరకు వెళ్లి ప్లీజ్ షేక్ హ్యాండ్ అని అడిగిన వారి కమాండ్ ను రిసీవ్ చేసుకుని వెంటనే కరచాలనం చేస్తోంది. మనుషులు మాటలను వింటూ ప్రతీగా స్పందిస్తోంది. తనను పొగుడుతూ, రోబో పనితీరును చెబుతున్నప్పుడు చప్పట్లు కొడుతూ స్పందిస్తోంది. ప్రతీ ఒక్కరినీ గమనిస్తూ , అతిథులతో వినయంగా , మర్యాదగా నడుచుకుంటూ ఆకట్టుకుంటోంది. తెలుగులో మాట్లాడుతున్న మాటలకు సైతం ప్రతిగా స్పందిస్తోంది. గత రెండేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం అనేక సదస్సులు ఏర్పాటు చేసినప్పటికీ ఈ తరహా రోబో ఎట్రాక్షన్ గతంలో ఎన్నడూ లేదు. ఇలా విదేశీ అతిథులను సైతం మైమరపించే రోబో ప్రవర్తన, స్పందించే విధానం గ్లోబల్ సమ్మిట్‌కు సెంట్రాఫ్ అట్రాక్షన్ గా చెప్పవచ్చు. సినీ హీరో నాగార్జున వంటి సెలబ్రిటీలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, విదేశీ అతిథులు ఇలా వీరు ఎదురైనప్పుడు హాయ్ చెబుతున్న ఎక్స్ మ్యాన్ పలకరిస్తున్న తీరు, గ్లోబల్ సమ్మిట్‌కు హైలైట్ అనడంతో ఏమాత్రం సందేహంలేదు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం, ప్రపంచ స్థాయిలో ఈ సమ్మిట్ జరగబోతోందని ముందు నుంచే చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం, రోబోను రంగంలోకి దించి, వినూత్న ప్రయోగాలకి శ్రీకారం చుట్టి వారెవ్వా అనిపిస్తోంది.





















