Road Accident: వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం- ఆటోలు, కారుపై లారీ బోల్తా పడి ఏడుగురు దుర్మరణం
Warangal Crime News | వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోలు, కారుపై ఇనుప స్తంభాలతో వెళ్తున్న లారీ బోల్తా పడి ఏడుగురు దుర్మరణం చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.

Road Accident in Warangal District | మామునూరు: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మామునూరులో ఇనుప స్తంభాల లోడుతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది. పక్కనే వెళ్తున్న కారు, రెండు ఆటోలపై లారీ బోల్తా పడటంతో ఏడుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికుల సహాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స అందించేందుకు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మృతుల్లో నలుగురు మహిళలు ఉండగా, ఓ బాలుడు ఉన్నాడు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. లారీ డ్రైవర్ ఓవర్ స్పీడ్ కారణంగానే బోల్తా పడినట్లు సమాచారం.
అసలేం జరిగిందంటే..
లారీ ఖమ్మం నుంచి వరంగల్ కు వెళ్తుంది. యూరియా బస్తాల లోడ్‌తో ఆటో కూడా వరంగల్ వైపే వెళ్తుంది. ఐనవోలు మండలం పంథిని వద్ద ఆటోను లారీ ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. మామునూరు వద్ద భారత్ పెట్రోల్ పంప్ సమీపంలో ఐరన్ స్తంభాల లోడుతో వెళ్తున్న లారీ మరో ఆటోను ఢీ కొట్టింది. ఈ క్రమంలో లారీలోని లోడ్ ఆటో మీద పడింది. దాంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు మృతిచెందగా, మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. నలుగురు వ్యక్తులు ఆ ఐరన్ పట్టాల కింద చిక్కుకున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. లారీ డ్రైవర్ మద్యం మత్తు ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు.
ఆటోలో ప్రయాణిస్తున్న వారు వ్యవసాయ పనిముట్లు చేసుకుని జీవనం సాగించేవారు. మామునూరు వద్ద భారీ ప్రమాదం జరగడంతో వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదం జరిగిన చోట అటు కిలోమీటర్, ఇటువైపు 1 కిలోమీటర్ మేర ట్రాఫిక్ జాం అయింది. పోలీసులు, సహాయక సిబ్బందితో కలిసి రోడ్డుపై పట్టాలను తొలగిస్తున్నారు. ఇనుప పట్టాల కింద చిక్కుకుని వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

