Hyderabad Crime News: మీర్‌పేట హత్య కేసులో కీలక అప్‌డేట్- నిందితుడు గురుమూర్తి ఎత్తులకు చెక్ చెప్పిన పోలీసులు
Meerpet Crime News: మీర్‌పేట్ కేసులో మూడు రోజులుగా గురుమూర్తి ఎత్తులను పోలీసులు చిత్తు చేశారు. అతనికి వ్యతిరేకంగా కీలక సాక్ష్యాలు సంపాదించారు. లేటెస్ట్ టెక్నాలజీతో చెక్ పెట్టారు.

Hyderabad Crime News: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన హైదరాబాద్‌లోని మీర్‌పేట హత్య కేసులో పోలీసులు పెద్ద బ్రేక్‌త్రూ సాధించారు. నేరం చేసినట్టు గురుమూర్తి అంగీకరించిన దాన్ని నిరూపించే సాక్ష్యాలు సంపాదించేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. మొత్తానికి మూడు రోజుల తర్వాత పోలీసులు ఈ విషయంలో విజయం సాధించారు. బ్లూరే టెస్టుతో కీలకమైన ఆధారాలు సంపాదించారు. ఇప్పుడు వాటి ఆధారంగా మిస్సింగ్ కేసును కాస్త హత్య కేసుగా మార్చారు. ఇందులో గురుమూర్తిని నిందితుడిగా పేర్కొన్నారు.
మీర్‌పేట వెంకటమాధవి హత్య కేసులో భర్త గురుమూర్తిపై పోలీసులు హత్యకేసు నమోదు చేశారు. అతనిపై బీఎన్‌ఎస్(BNS) 101 సెక్షన్ కింద కేసు ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు. ఇప్పటి వరకు అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు దొరక్కపోవడంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. మూడు రోజులు శ్రమించి చివరకు కీలకమైన ఆధారాలు సంపాదించారు.
బ్లూ రేస్ టెక్నాలజీతో గురుమూర్తి ఇంటిని మొత్తాన్ని శోధించి వెంకటమాధవి శరీర టిష్యూ, వెంట్రుకలు, రక్తపు మరకలు గుర్తించారు. వాటిని ఫోరెన్సిక్‌ల్యాబ్‌కు పంపించారు. వీటితోపాటు వారి పిల్లల నుంచి కూడా కొన్ని శాంపిల్స్ కూడా తీసుకొన్నారు. డీఎన్‌ఏ మ్యాచ్ అయితే కచ్చింగా కేసులో పోలీసులు దూకుడు పెంచనున్నారు.





















