SSC CHSL Results 2024: సీహెచ్ఎస్ఎల్-2024 తుది ఫలితాలు విడుదల, 3421 మందికి ఉద్యోగాలు
CHSL: సీహెచ్ఎస్ఎల్ 2024 తుది ఫలితాల్లో మొత్తం 3421 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు, ఎంపికకాని అభ్యర్థుల పూర్తి మార్కుల వివరాలు డిసెంబర్ 14న వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నట్లు కమిషన్ తెలిపింది.

SSC CHSL 2024 Final Result: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్(సీహెచ్ఎస్ఎల్) 2024 తుది ఫలితాలు ఫిబ్రవరి 18న విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. టైర్-1, టైర్-2, స్కిల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం ఈ ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. తుది ఫలితాలకు సంబంధించి మొత్తం 3421 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వివిధ కారణాలతో 24 మంది అభ్యర్థుల ఫలితాలను పెండింగ్‌లో ఉంచింది. 12 మంది అభ్యర్థిత్వాన్ని రద్దుచేసింది. ఫలితాలతోపాటు కేటగిరీలవారీగా కటాఫ్ మార్కుల వివరాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది.
CHSL తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి..
కటాఫ్ మార్కుల వివరాల కోసం క్లిక్ చేయండి..
కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో 3712 లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ తదితర పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గతేడాది ఏప్రిల్ 8న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థుల నుంచి మే 7 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు జులై 1 నుంచి 11 మధ్య టైర్-1 పరీక్షలు నిర్వహించింది. టైర్-1 పరీక్ష ఫలితాలను సెప్టెంబరు 9న విడుదల చేసింది. వీరిలో 39,835 మంది అభ్యర్థులు టైర్-2 పరీక్షలకు అర్హత సాధించారు. వీరికి నవంబరు 18న టైర్-2 పరీక్షను నిర్వహించింది. అభ్యర్థులకు ఈ నెల (ఫిబ్రవరి) 4 నుంచి 10 వరకు ప్రాధామ్యాల నమోదుకు అవకాశం కల్పించింది. మొత్తం 27,092 మంది అభ్యర్థుల ఆప్షన్లు నమోదుచేసుకున్నారు.
టైర్-2 పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు టైర్-3లో స్కిల్‌టెస్ట్/ టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. డేటా ఎంట్రీ ఆపరేటర్లకు.. డేటా ఎంట్రీ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కాల వ్యవధి 15 నిమిషాలు. డేటా ఎంట్రీ పోస్టులకు గంటకు 8000 కీ డిప్రెషన్స్ కంప్యూటర్‌పై ఇవ్వాలి. ఇందుకోసం సుమారు 2000-2200 కీ డిప్రెషన్స్ ఉన్న ఇంగ్లిష్ వ్యాసాన్ని ఇచ్చి 15 నిమిషాల వ్యవధిలో కంప్యూటర్‌లో టైప్ చేయమంటారు. ఇక లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. పరీక్ష సమయం 10 నిమిషాలు. టైపింగ్ టెస్ట్‌లో ఇంగ్లిష్ ఎంచుకున్నవారు నిమిషానికి 35 పదాలు, హిందీని ఎంచుకున్నవారు నిమిషానికి 30 పదాలు టైప్ చేయాల్సి ఉంటుంది.టైర్-1, టైర్-2 రాతపరీక్షలతోపాటు అవసరమైన పోస్టులకు కంప్యూటర్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల తర్వాత ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
జీతాభత్యాలు..
➥ ఎల్‌డీసీ, జేఎస్‌ఏ పోస్టులకు రూ.19,900-63,200 ఇస్తారు.
➥ డేటాఎంట్రీ ఆపరేటర్‌కు రూ.25,500-81,100 (పే లెవల్-4), రూ.29,200-92,300 (పే లెవల్-4) ఇస్తారు.
➥ డేటాఎంట్రీ ఆపరేటర్ (గ్రేడ్-ఎ)కు పోస్టులకు రూ.29,200-92,300 ఇస్తారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

