Balakrishna : వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను - పద్మభూషణ్ పురస్కారంపై బాలకృష్ణ రియాక్షన్ ఇదీ
Balakrishna : పద్మభూషణ్ పురస్కారం ప్రకటించినందుకు నందమూరి బాలకృష్ణ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటానని హామీ ఇచ్చారు.

Balakrishna : గణతంత్ర దినోత్సవాన్ని(Republic Day) పురస్కరించుకుని కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో భాగంగా సినీ రంగానికి చేసిన విశేష సేవలకు గానూ తెలుగు హీరో, నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించారు. అవార్డు ప్రకటించిన సందర్భంగా స్పందించిన బాలకృష్ణ.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమయంలో శుభాకాంక్షలు తెలియజేసిన, చేస్తోన్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
"నాకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిందుకు భారత ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. ఈ సుధీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు, కుటుంబ సభ్యులకు, యావత్ చలనచిత్ర రంగానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుండి ఆయన వారసుడిగా నేటి వరకు నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తోన్న నా అభిమానులకు, నాపై తమ విశేష ఆధారాభిమానాలు కురిపిస్తోన్న అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటాను" అని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో తన తోటి పద్మ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు అందిస్తున్నానన్నారు.
బాలకృష్ణకు చంద్రబాబు అభినందనలు
బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించడంతో ఆయన కుటుంబ సభ్యులూ 'ఎక్స్' వేదికగా పోస్టులు చేశారు. అభినందనలు తెలుపుతూ తమ ప్రేమను చాటుకున్నారు. "పద్మభూషణ్ అవార్డు అందుకున్న సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలు. ఎన్టీఆర్ గారి వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ, సినిమా, రాజకీయాలు, దాతృత్వ రంగాలలో రాణిస్తూ.. ప్రజా సంక్షేమానికి, ముఖ్యంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా మీరు చేసిన అంకితభావం లెక్కలేనన్ని జీవితాలను నిలిపింది. ఇది లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. నిజమైన ఐకాన్.. ఇది ఆయనకు తగిన గౌరవం" అని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు.
Heartfelt congratulations to Telugu cinema legend and Hindupur MLA, Shri Nandamuri Balakrishna Garu, on being conferred the Padma Bhushan! Upholding the legendary NTR Garu’s legacy, you have excelled in cinema, politics, and philanthropy. Your dedication to public welfare,… pic.twitter.com/rC4HEABLmN
— N Chandrababu Naidu (@ncbn) January 25, 2025
"బాలా బాబాయ్ కి హృదయపూర్వక అభినందనలు. సినిమా రంగానికి మీరు చేసిన అసమాన సేవలకు, నిర్విరామ ప్రజా సేవకు ఇది గుర్తింపు" అని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.
Heartiest congratulations to Bala Babai on being honored with the prestigious Padma Bhushan award. This recognition is a testament to your unparalleled contributions to cinema and your relentless public service.
— Jr NTR (@tarak9999) January 25, 2025
Heartfelt congratulations to my Babai Nandamuri Balakrishna garu on receiving the prestigious Padma Bhushan award. This honor is a true recognition of your exceptional contributions to the world of cinema and your relentless efforts in serving society.
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) January 25, 2025
"పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన నా ప్రియమైన మిత్రుడు నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు" అంటూ మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేశారు. వీరితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా బాలకృష్ణను అవార్డు వరించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Heartiest Congratulations on the conferment of prestigious Padma Vibhushan to Dr.D Nageswara Reddy garu for his illustrious services and Padma Bhushan award to dear friends #NandamuriBalakrishna, #AjithKumar, Sri Anant Nag , Sekhar Kapur Ji ,
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 25, 2025
my co star in Rudraveena #Sobhana…
Also Read : Republic Day 2025: ఢిల్లీలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు - జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము






















