Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin Dravidian Algorithm ABP Southern Rising Summit 2025 | ద్రవిడయన్ ఆల్గారిథంపై మాట్లాడిన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025లో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సరికొత్త నినాదాన్ని ప్రకటించారు. ద్రవిడియన్ ఆల్గారిథం అంటూ డీఎంకే పార్టీ తరపున, తమిళనాడు ప్రభుత్వం తమ ఆలోచనలు ఏవిధంగా ఉన్నాయో ప్రకటించారు ఉదయనిధి. తమిళనాడు రాజకీయాలు ఎప్పడూ చాలా స్పష్టంగా, నిలకడగా ఉంటాయి. దీన్నే మేం ద్రవిడియన్ ఆర్గారిథం అని పిలుస్తున్నాం. గడచిన వందేళ్లుగా జరిగిన అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక మార్పులు చేర్పుల కారణంగా ఈ ద్రవిడియన్ ఆల్గారిథం డెవలప్ అయ్యింది. తమిళనాడులో కీలక రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడల్లా ఇక్కడి ప్రజలు ద్రవిడియన్ ఆల్గారిథంనే ఫాలో అవుతున్నామని చెప్పారు. తమిళనాడు లాంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అస్సలు సరిగ్గా లేదు. కేంద్ర నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడ్డుకుంటున్నారు. పన్నుల్లో మాకు రావాల్సిన వాటాలను సరిగ్గా పంచట్లేదు. నియోజకవర్గాల పునర్విభజన కావొచ్చు..నూతన విద్యావిధానం కావచ్చు కేంద్రం తాలుకూ ఆలోచనలను మాపై రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉదయనిధి స్టాలిన్.






















