అన్వేషించండి

Smriti Mandhana Wedding: పలాష్ ముచ్చల్, స్మృతి మంధానా పెళ్లి రద్దు.. క్లారిటీ ఇచ్చిన టీమిండియా క్రికెటర్

Smriti Mandhana Wedding called off : స్మృతి మంధానా, పలాష్ ముచ్చల్ పెళ్లి రద్దు అయింది. గత రెండు వారాల సైలెన్స్ తరువాత స్మృతి మంధాన తన నిర్ణయాన్ని స్వయంగా ప్రకటించారు.

Smriti Mandhana Marriage Called off | క్రికెటర్ స్మృతి మంధానా, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ ల వివాహం రద్దయింది. స్మృతి, పలాష్‌ల వివాహ వేడుకతో గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచారు. నవంబర్ 23న జరగాల్సిన వివాహం చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారు. తాజాగా ఆ పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు స్మృతి స్వయంగా పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చారు. 

స్మృతి మంధానా చేసిన పోస్ట్‌లో ఏమన్నారు..

గత కొన్ని వారాలుగా నా జీవితం గురించి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో మాట్లాడటం అవసరమని భావిస్తున్నాను. నా జీవితాన్ని అలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను. అయితే పెళ్లి రద్దయిందని నేను స్పష్టం చేస్తున్నాను.

'నేను పెళ్లి విషయాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నాను. మీ అందరినీ అదే చేయమని కోరుతున్నాను. ఈ సమయంలో ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని మిమ్మల్ని కోరుతున్నాను. మమ్మల్ని ముందుకు సాగనివ్వండి. మనందరికీ ఒక గొప్ప లక్ష్యం ఉంటుందని నమ్ముతున్నాను, నా విషయంలో ఎల్లప్పుడూ నా దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం మాత్రమే. నేను వీలైనంత కాలం భారత్ కోసం ఆడాలని, ట్రోఫీలు గెలవాలని కోరుకుంటున్నాను. నా ఫోకస్ అంతా ఆటపైనే ఉంటుంది.' అని మంధాన తన పోస్టులో రాసుకొచ్చారు.


Smriti Mandhana Wedding: పలాష్ ముచ్చల్, స్మృతి మంధానా పెళ్లి రద్దు.. క్లారిటీ ఇచ్చిన టీమిండియా క్రికెటర్

పలాష్ ముచ్చల్ కూడా పోస్ట్ చేశాడు

బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ సైతం తన పెళ్లి రద్దు కావడంపై స్పందించాడు. 'నా జీవితంలో ముందుకు సాగాలని, వ్యక్తిగత రిలేషన్‌లో వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నాను. ఆధారాలు లేని పుకార్లపై ప్రజలు ఎలా స్పందిస్తున్నారో చూసి చాలా బాధపడ్డాను, ఇది నా జీవితంలో కష్టమైన దశ. నేను ఈ పరిస్థితిని గౌరవంగా ఎదుర్కొంటాను. వదంతుల ఆధారంగా ఎవరినీ, సాక్ష్యాలు లేని వాటిని, మనం తీర్పు చెప్పే ముందు ఆగాలని నేను ఆశిస్తున్నాను. మన మాటలు ఇతరుల్ని గాయపరుస్తాయి. వాటి గురించి ఆలోచిస్తున్నప్పుడు, ప్రపంచంలో ఎంతమంది ఇలాంటి పరిణామాలను అనుభవిస్తున్నారో అనిపిస్తుంది. తప్పుడు వార్తలు, పరువు నష్టం కలిగించే విషయాలను ప్రచారం చేసే వారిపై నా టీమ్ కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ కష్ట సమయంలో నాకు అండగా నిలబడిన వారికి ధన్యవాదాలు' చెబుతూ పలాష్ ముచ్చల్ పోస్ట్ చేశాడు.


Smriti Mandhana Wedding: పలాష్ ముచ్చల్, స్మృతి మంధానా పెళ్లి రద్దు.. క్లారిటీ ఇచ్చిన టీమిండియా క్రికెటర్

పలాష్ ముచ్చల్, స్మృతి మంధాన నవంబర్ 23న వివాహం చేసుకోవాల్సి ఉంది. వారి పెళ్లికి సంబంధించిన ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు జరిగాయి. ఆ తరువాత ఘనంగా హల్దీ వేడుక జరిగింది. మెహందీ, సంగీత్ వేడుకలు ఘనంగా జరిగాయి. అందుకు సంబంధించిన ఫోటోలు చాలా వైరల్ అయ్యాయి. కానీ అకస్మాత్తుగా పెళ్లిరోజు స్మృతి తండ్రికి ఆరోగ్యం క్షీణించిందని వార్తలు వచ్చాయి. స్మృతి మంధాన తన తండ్రిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆ సమయంలో స్మృతి, పలాష్‌ల పెళ్లి వాయిదా పడింది. ప్రస్తుతం తండ్రి ఆరోగ్యం ముఖ్యమని స్మృతి చెప్పారని సన్నిహితులు ఆ సమయంలో తెలిపారు. ఆ తరువాత పలాష్‌ మోసం చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ సమయంలో పలాష్ సైతం అస్వస్థతకు లోనై హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యాడు. పెళ్లి కచ్చితంగా జరుగుతుందని పలాష్ తల్లి కాన్ఫిడెన్స్‌గా చెప్పారు. కానీ చివరికి పెళ్లి వాయిదా వేసుకున్నట్లు పలాష్, స్మృతి ప్రకటించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Rahane Struggle Days: రెండేళ్లపాటు వాటర్ బాయ్ గానే రహానే.. సింపథీ వద్దనుకుని బెంచ్ పై వేచి చూసిన స్టార్ ప్లేయర్, టెస్ట్ డెబ్యూ వెనుక  ట్విస్ట్!
రెండేళ్లపాటు వాటర్ బాయ్ గానే రహానే.. సింపథీ వద్దనుకుని బెంచ్ పై వేచి చూసిన స్టార్ ప్లేయర్, టెస్ట్ డెబ్యూ వెనుక  ట్విస్ట్!
IND vs SL:  తొలి టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. వార్మ‌ప్ మ్యాచ్ లో బ‌రిలోకి దిగని గిల్.. కార‌ణం ఏంటంటే..?
తొలి టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. వార్మ‌ప్ మ్యాచ్ లో బ‌రిలోకి దిగని గిల్.. కార‌ణం ఏంటంటే..?
Viral Video - Tragic Football Incident: ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతున్న మ్యాచ్.. అంత‌లోనే పిడుగుపాటు.. ప్లేయ‌ర్ మృత్యువాత‌.. 12 మందికి గాయాలు!
ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతున్న మ్యాచ్.. అంత‌లోనే పిడుగుపాటు.. ప్లేయ‌ర్ మృత్యువాత‌.. 12 మందికి గాయాలు!
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Embed widget