Smriti Mandhana Wedding: స్మృతి మంధానా- పలాష్ ముచ్చల్ పెళ్లిపై ప్రచారం.. వదంతులేనని క్లారిటీ
Smriti Mandhana Marriage | స్మృతి మంధానా, పలాష్ ముచ్చల్ పెళ్లి తేదీ ఫిక్స్ అయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై స్మృతి సోదరుడు శ్రావణ్ మంధాన క్లారిటీ ఇచ్చాడు.

Smriti Mandhana wedding | భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధానా, బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ ల వివాహం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. నవంబర్ 23న జరగాల్సిన ఈ హైప్రొఫైల్ మ్యారేజ్ చివరి నిమిషంలో వాయిదా పడింది. స్మృతి మంధానా తండ్రి శ్రీనివాస్ మంధానాకి హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో వివాహ వేడుక వాయిదా పడింది. తరువాత ఆయనను సాంగ్లీలోని ఆసుపత్రిలో చేర్పించారు. అదే సమయంలో పలాష్ కూడా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతానికి ఇద్దరూ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో మంధానా, పలాష్ పెళ్లి కొత్త తేదీ ప్రకటిస్తారా.. లేక వివాహం జరగదని చెబుతారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వివాహంపై స్పందించిన స్మృతి సోదరుడు
డిసెంబర్ 7వ తేదీన స్మతి మంధాన, పలాష్ ముచ్చల్ మ్యారేజీ కొత్త తేదీగా వైరల్ అవుతోంది. చాలా మంది వినియోగదారులు దీనిని 'ఖచ్చితమైన తేదీ' అని సోషల్ మీడియాలో మంగళవారం నుండి పోస్ట్ చేయడం ప్రారంభించారు. కాని కుటుంబం నుండి దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. ఈ విషయంపై స్మృతి మంధాన సోదరుడు శ్రవణ్ మంధానా ఈ వార్తలను ఖండించారు.
స్మతి మంధాన సోదరుడు శ్రవణ్ హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. "ఆ కొత్త తేదీ గురించి నాకు ఏమీ తెలియదు. పెళ్లి ఇంకా వాయిదా పడింది. కొత్త తేదీ గురించి వస్తున్న వార్తలు పుకార్లు మాత్రమే. దీనిపై కుటుంబం త్వరలోనే అప్డేట్ ఇస్తుంది" అని అన్నారు. శ్రవణ్ స్పందించడంతో డిసెంబర్ నెలలో మ్యారేజీ అని వైరల్ అవుతున్న ఈ తేదీ వదంతులు మాత్రమే అని స్పష్టమైంది.
అమితా ముచ్చల్ ఆశాభావం
పలాష్ తల్లి అమితా ముచ్చల్ పెళ్లి వాయిదా పడటంపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ హఠాత్తుగా జరిగిన సంఘటన ఇరు కుటుంబాలపై చాలా ప్రభావం చూపిందన్నారు. స్మృతి, పలాష్ ఇద్దరూ ఈ మొత్తం వ్యవహారంతో చాలా బాధపడ్డారని.. రెండు కుటుంబాలు వేడుక కోసం సిద్ధంగా ఉన్నాయని అన్నారు.
"స్మృతి, పలాష్ ఇద్దరూ పెళ్లి ఆగిపోవడంపై బాధపడుతున్నారు... అన్నీ సిద్ధంగా ఉన్నాయి. నేను స్మృతి కోసం ఒక గ్రాండ్ వెల్కమ్ కూడా ప్లాన్ చేశాను. త్వరలోనే అంతా సవ్యంగా జరుగుతుంది, మంధాన, పలాష్ పెళ్లి త్వరలో జరుగుతుంది" అని అన్నారు.
పలాష్ పెళ్లికి ముందే ఓ అమ్మాయితో లవ్ అఫైర్ నడిపాడని ప్రచారం జరిగింది. వారి చాటింగ్ సంబంధించి స్క్రీట్ షాట్లు సోషల్ మీడియాను షేక్ చేశాయి. అందుకే వివాహం ఆగిపోయిందని, చివరి నిమిషంలో పెళ్లి ఆపడానికి స్మృతి తండ్రి అస్వస్థతకు గురయ్యారని చెప్పి ప్రకటనతో మ్యారేజ్ ను బ్రేక్ చేశారని సోషల్ మీడియాలో డిస్కషన్ నడిచింది. జులై నెలలో పోస్ట్ చేసిన స్క్రీన్ షాట్లు ఇప్పుడు ఎందుకు వైరల్ చేశారో తెలియడం లేదని ఆ యువతి స్పందించింది. ఈ క్రమంలో అనారోగ్యంతో వరుడు పలాష్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. ఇటీవల తిరిగి ఇంటికి చేరుకున్నాడు.





















