Smriti Mandhana–Palash Muchhal Wedding Row: స్మృతి మంధాన పెళ్లిపై మేరీ డి'కోస్టా సంచలన పోస్టు! పలాష్ ముచ్చల్‌తో సంబంధంపై క్లారిటీ!
Smriti Mandhana–Palash Muchhal Wedding Row: కుటుంబ ఆరోగ్య సమస్యల కారణంగా స్మృతి మంధాన - పలాష్ ముచ్చల్ వివాహం వాయిదా పడింది, ఇది పుకార్లకు దారితీసింది. దీంతో మేరీ డి’కోస్టా స్పందించారు.

Smriti Mandhana–Palash Muchhal Wedding Row: క్రికెటర్ స్మృతి మంధాన- మ్యాజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ వివాహం అస్మాత్తుగా ఆగిపోయినప్పటి నుంచి ఊహాగానాలు, పుకార్లతో ఇంటర్‌నెట్ నిండిపోతోంది. సోషల్ మీడియాలో ఒకటే రచ్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే పలాష్ ముచ్చల్‌కు వేరే వాళ్లతో సంబంధాలు ఉన్నాయని కూడా ప్రచారం మొదలైపోయింది. మేరీ డి'కోస్టాతో చాటింగ్ కూడా వైరల్ అయ్యింది. దీంతో స్మృతి, పలాష్ మధ్య బ్రేకప్ అయిందని కూడా ప్రచారం సాగుతోంది. ఇంతలో మేరీ డి'కోస్టా సోషల్ మీడియాలో స్పందించారు. నన్ను లాక్కండి రావుగారూ అన్నట్టు క్లారిటీ ఇచ్చేశారామె.
వైరల్ స్క్రీన్‌షాట్‌లు పుకార్లను రేకెత్తిస్తాయి
స్మృతి, పలాష్ పెళ్లికి బ్రేక్ పడిన తర్వాత డి'కోస్టా రెడ్డిట్‌తో అతనికి రిలేషన్ ఉందని పుకార్లు మొదలయ్యాయి. ఇంతలో వారిద్దరి మధ్య జరిగిందని చెప్పే ఛాటింగ్ సోషల్ మీడియాలో కనిపించింది. అంతే నెటిజన్లు కామెటం్స్ చేయడం మొదలు పెట్టారు. ఈ చాట్‌లు వైరల్ అయిన కాసేపటికే సోర్స్‌లో పోస్టులు డిలీట్ చేశారు. అయినా సరే ప్రచారం మాతత్రం ఆగలేదు. దీంతో ఈ వివాదం చుట్టూ అనేక అనుమానాలు నెలకొన్నాయి.
ప్రచారంపై స్పందించిన డి'కోస్టా
జరుగుతున్న ప్రచారంపై ఇన్‌స్టాగ్రామ్‌లో డి'కోస్టా స్పందించారు. తాను పలాష్ ముచ్చల్‌ను ఎప్పుడూ కలవలేదని తేల్చి చెప్పారు. "మొదట, చాటింగ్ 2025 ఏప్రిల్ 29, మే 30 మధ్య జరిగింది, కాబట్టి ఆ పరిచయం ఒక నెల మాత్రమే కొనసాగింది. నేను అతన్ని ఎప్పుడూ కలవలేదు. నేను అతనితో ఏ విధంగానూ సంబంధం పెట్టుకోలేదు. ఈ విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాను" అని ఆమె ఇన్‌స్టాగ్రామ్ నోట్‌లో రాసింది.
పెళ్లి టైంలోనే చాట్‌లు బయటు రావడంపై కూడా అమె స్పందించారు. చాలా కాలం క్రితమే వాటిని పోస్టు చేసినట్టు వెల్లడించింది. “ప్రజలు ‘ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడాలి?’ అని అడుగుతున్నారు. నిజం ఏమిటంటే, నేను జూలైలో ఈ వివరాలు వెల్లడించాను, కానీ ఆ సమయంలో అతను ఎవరో ఎవరికీ తెలియదు, కాబట్టి అది పెద్దగా ఎవరూ పెట్టించుకోలేదు,” అని ఆమె చెప్పింది.
“నేను కొరియోగ్రాఫర్ కాదు”
డి’కోస్టా కూడా తనపై వచ్చిన విమర్శలు తన పాత్ర గురించి వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టింది. తాను కొరియోగ్రాఫర్ కాదని చెప్పింది. పలాష్ చేతిలో మోసపోయిన వ్యక్తిని కూడా కాదని పేర్కొంది.
“నేను ఎవరో అనే దానిపై కూడా చాలా గందరగోళం ఉంది. నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను, నేను కొరియోగ్రాఫర్ కాదు, అతను మోసం చేసిన వ్యక్తిని కూడా కాదు” అని ఆమె రాసిన నోట్‌లో ఉంది. .
వివాహం ఎందుకు ఆగింది?
స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ నవంబర్ 23న మహారాష్ట్రలోని సాంగ్లిలో వివాహం చేసుకోవాల్సి ఉంది. స్థానిక రిసార్ట్‌లో సంగీత్ , హల్ది వేడుకలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అయితే, స్మృతి తండ్రి గుండె సంబంధిత అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరడంతో వేడుకలు అకస్మాత్తుగా ఆగిపోయాయి.
ఈ పరిణామాలు కుటుంబ సభ్యుల వివాహాన్ని వాయిదా వేసేలా చేశాయి. ఈ ఊహాగానాలకు తోడుగా, స్మృతి తన నిశ్చితార్థం, వివాహానికి ముందు పోస్ట్‌లన్నింటినీ ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించింది. వేడుకలో పాల్గొన్న జెమిమా రోడ్రిగ్స్‌తో సహా ఆమె సహచరులు కూడా సైలెంట్‌గగా వీడియోలను తొలగించారు. అదే సమయంలో ఒత్తిడి కారణంగా పలాష్ ముంబై ఆసుపత్రిలో చేరారు.
తీర్పులు ఇచ్చేయొద్దని పలాష్ ముచ్చల్ కుటుంబ సభ్యుల వేడుకోలు
పెరుగుతున్న పుకార్ల మధ్య, పలాష్ కజిన్ నీతి తక్ స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన మెసేజ్‌లో ధృవీకరించని వాదనల ఆధారంగా అభిప్రాయాలను ఏర్పరచుకోవద్దని కోరారు. “పలాష్ నేడు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు; మీరందరూ నిజం తెలియకుండా పలాష్‌ను తప్పుగా చిత్రీకరించొద్దు” అని రాశారు.




















