Palash Muchhal: స్మృతి మంధానాతో పెళ్లి వాయిదా తర్వాత తొలిసారి కనిపించిన పలాష్ ముచ్చల్..
Smriti Mandanna | పలాష్ ముచ్చల్, స్మృతి మంధానా వ్యక్తిగత జీవితం గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచింది. పెళ్లి వాయిదా తర్వాత పలాష్ మోసం చేశాడని వార్తలు వచ్చాయి.

క్రికెటర్ స్మృతి మంధానా, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ వివాహం చివరి నిమిషంలో ఆగిపోవడం తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కుతారని పలాష్ తల్లి ఇటీవల మీడియాకు తెలిపారు. కానీ పలాష్ ముచ్చల్ ముందే ప్రేమ వ్యవహారం నడిపించాడని, మంధానాను మోసం చేశాడంటూ లవర్‌తో జరిపిన చాటింగ్ స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి.
వాస్తవానికి పలాష్ ముచ్చల్, స్మతి మంధానా నవంబర్ 23న వివాహం చేసుకోవాల్సి ఉంది. పెళ్లికి సంబంధించిన వేడుకలు రెండు, మూడు రోజులు ఘనంగా జరిగాయి. వారి హల్దీ, మెహందీ, సంగీత్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. కానీ, అకస్మాత్తుగా వారి పెళ్లి వాయిదా పడిందనే వార్తలు వచ్చాయి.
స్మృతి మంధాన తండ్రి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీని కారణంగా, ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. స్మృతి తండ్రి ఆసుపత్రిలో ఉండటంతో, ఆ సమయంలో తాను పెళ్లి చేసుకోలేనంటూ మంధాన తన వివాహాన్ని వాయిదా వేసుకుందని సన్నిహితులు తెలిపారు. ఆ మరుసటి రోజే పలాష్ అస్వస్థతకు లోనయ్యాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు పెళ్లి వాయిదా పడిన తర్వాత పలాష్ ముచ్చల్ తొలిసారి బయట కనిపించాడు.
బ్లాక్ డ్రెస్సులో పలాష్ ముచ్చల్
మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ విమానాశ్రయంలో కనిపించాడు. అతను పూర్తి బ్లాక్ ఔట్ ఫిట్ లుక్ లో కనిపించాడు. పలాష్ బ్లాక్ షర్ట్, ప్యాంటు ధరించాడు. చేతిలో పుస్తకం, ఫోన్‌తో కనిపించాడు. పెళ్లి వాయిదా తరువాత తొలిసారి పలాష్ ముచ్చల్ కనిపించడంతో వీడియో చాలా వేగంగా వైరల్ అవుతోంది.
View this post on Instagram
పలాష్ స్మృతిని మోసం చేశాడనే ఆరోపణలు
స్మృతి మంధాన, పలాష్‌ల పెళ్లి వాయిదా పడిన తర్వాత, పలాష్ క్రికెటర్ స్మృతిని మోసం చేశాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. పలాష్ ప్రేమించిన అమ్మాయితో చాట్ చేసినట్లు కూడా వైరల్ అయింది. దీనిపై పలాష్, స్మృతి మంధానా గానీ ఇంకా స్పందించలేదు. పలాష్ కజిన్ పలాష్‌కు మద్దతు ఇచ్చింది. పలాష్ తల్లి సైతం వారి పెళ్లి గురించి అప్‌డేట్ ఇచ్చింది.
హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ, స్మృతి తండ్రికి ఆరోగ్యం బాగాలేని కారణంగా పెళ్లిని వాయిదా వేయాలని పలాష్ మొదటగా చెప్పాడని ఆయన పలాష్ తల్లి అమితా తెలిపారు. స్మృతి మంధానకు తండ్రి అంటే చాలా ఇష్టమని, పలాష్ సైతం ఆయనను చాలా గౌరవిస్తాడని చెప్పారు. స్మృతితో ఉన్నట్లుగానే పలాష్‌తోనూ మంధాన తండ్రి ఎక్కువ సన్నిహితంగా ఉంటాడని తెలిపారు. స్మృతి, పలాష్‌ల పెళ్లి ఆగిపోయిందా, లేక వాయిదా వేశారా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. మంధాన కుటుంబం నుంచి పెళ్లి గురించి ఎలాంటి స్పందన లేదు. కానీ పలాష్ వైపు నుంచి మాత్రం వివాహ వేడుక త్వరలో జరుగుతుందని చెబుతున్నారు.






















