KCR Urgent Meet : మంత్రులు, స్పీకర్‌తో ఎమర్జెన్సీ మీటింగ్ - కేసీఆర్ మార్క్ నిర్ణయం తీసుకోబోతున్నారా ?

మంత్రులు, స్పీకర్‌తో కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌ హౌస్‌లో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఏ నిర్ణయం తీసుకోబోతున్నారోననే ఉత్కంఠ రాజకీయవర్గాల్లో ఏర్పడింది.

FOLLOW US: 

ఉన్నట్లు ఉండి.. తెలంగాణ మంత్రులందరికీ ప్రగతి భవన్‌ నుంచి ఫోన్లు వెళ్లాయి. ఉన్న పళంగా బయలుదేరి అందరూ ఎర్రవెల్లిలోని సీఎం కేసీఆర్ (CM KCR ) ఫామ్‌హౌస్‌కు రావాలని ఆ ఫోన్ల నుంచి అందిన సందేశం. అక్కడ అర్జంట్ సమావేశం ( Urgent Meeting ) ఉందని కూడా చెప్పారు. అంతే మంత్రులు ఎక్కడ ఉన్న వారు అక్కడ నుంచి తమ దిశ మార్చుకుని ఎర్రవెళ్లి వైపు సాగిపోయారు. అలా సమాచారం ఇచ్చిన కొంత సేపటికే మంత్రులంతా ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. సీఎస్ సోమేష్ కుమార్‌తో పాటు కొంత మంది ఉన్నతాధికారులు కూడా ఫామ్‌హౌస్‌కు వచ్చారు. అలాగే స్పీకర్ పోరాటం శ్రీనివాస్ రెడ్డి కూడా హాజరైనట్లుగా తెలుస్తోంది. 

ఎవరితోనూ పూసుకొని తిరగం- గ్యాప్‌ పెట్టుకుంటే వస్తుంది, కేసీఆర్‌తో విభేదాలపై చినజీయర్ షాకింగ్ కామెంట్స్

ముగ్గురు మంత్రులు మాత్రం అందుబాటులో లేరు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మహా ( Vemula Prasant Reddy )రాష్ట్ర పర్యటనలో ఉన్నారు. మరో మంత్రి పువ్వాడ అజయ్ (Puvvada Ajay ) ఖమ్మంలో ఉన్నారు. ఇక కేటీఆర్ (KTR )  తెల్లవారుజామునే అమెరికా పర్యటనకు వెళ్లారు.  దీంతో ఈ ముగ్గురు కాకుండా మిగతా మంత్రులంతా హాజయ్యారు.  మంత్రులతో జరిగిన సమావేశానికి చీఫ్ సెక్రటరీతో పాటు కొంతమంది ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశం ఎజెండా ఏమిటన్నదానిపై స్పష్టత లేదు. పాలనాపరమైన అంశాలు చర్చిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

తెలంగాణ పాలిటిక్స్‌లో క్రేజీ అప్‌డేట్‌.. పాదయాత్రకు రెడీ అవుతున్న కేజ్రీవాల్ !

ప్రభుత్వ కార్యక్రమాలు, పనుల కోసం అయితే కేసీఆర్ ప్రగతి భవన్‌లోనే సమావేశం నిర్వహిస్తారు. పార్టీ కార్యక్రమాలు.. రాజకీయ పరమైన చర్చలు మాత్రమే ఫామ్‌హౌస్‌లో నిర్వహిస్తూ ఉంటారు. పైగా ఈ సమావేశం అత్యవసరంగా నిర్వహిస్తున్నారు . పాలనా పరమైన చర్చల కోసం అయితే స్పీకర్ పోచారంను ( Speaker Pocharam )  కూడా సమావేశానికి పిలిపించాల్సిన అవసరం ఏమిటననేది టీఆర్ఎస్ నేతలుక అంతుబట్టడం లేదు. 

కేసీఆర్ ఇటీవల ముందస్తు ఎన్నికల హడావుడిలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. . ప్రశాంత్ కిషోర్ (PK )  కూడా తెలంగాణలో సర్వే చేసి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్షాలు ఇప్పటికి పూర్తి స్థాయిలో ససన్నద్ధం కాలేదని.. ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయని కేసీఆర్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలపై చర్చల కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. సమావేశం తర్వాత టీఆర్ఎస్ వర్గాలు చెప్పే సమాచారాన్ని బట్టి ఈ భేటీ ఎందుకు నిర్వహించారో తెలిసే అవకాశం ఉంది. 

Published at : 19 Mar 2022 01:27 PM (IST) Tags: telangana trs kcr Telangana Speaker telangana early elections Prashant Kishore

సంబంధిత కథనాలు

KCR Letter : నీతి ఆయోగ్ నిరర్థక సంస్థ - అందుకే హాజరు కావడంలేదని మోదీకి కేసీఆర్ లేఖ !

KCR Letter : నీతి ఆయోగ్ నిరర్థక సంస్థ - అందుకే హాజరు కావడంలేదని మోదీకి కేసీఆర్ లేఖ !

Addanki Dayakar : తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త పంచాయతీ - అద్దంకి దయాకర్‌పై చర్యలకు సీనియర్ల డిమాండ్ !

Addanki Dayakar :  తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త పంచాయతీ - అద్దంకి దయాకర్‌పై చర్యలకు సీనియర్ల డిమాండ్ !

TDP - National Flag: "డీపీ"లు మార్చేసిన టీడీపీ - అంతా త్రివర్ణ పతాకమే !

TDP - National Flag:

Narsampet MLA : ఎమ్మెల్యే బర్త్‌డే కోసం మున్సిపల్ కౌన్సిల్ స్పెషల్ భేటీ - తెలంగాణలో వివాదం !

Narsampet MLA : ఎమ్మెల్యే బర్త్‌డే కోసం మున్సిపల్ కౌన్సిల్ స్పెషల్ భేటీ - తెలంగాణలో వివాదం !

Three Capitals : మూడు రాజధానుల బిల్లు ఇక పెట్టలేరు ! వైఎస్ఆర్‌సీపీ వ్యూహమా ? విజయసాయిరెడ్డి తొందరపడ్డారా ?

Three Capitals :  మూడు రాజధానుల బిల్లు ఇక పెట్టలేరు ! వైఎస్ఆర్‌సీపీ వ్యూహమా ? విజయసాయిరెడ్డి తొందరపడ్డారా ?

టాప్ స్టోరీస్

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్

CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్