Kunal Kamra: వెనక్కి తగ్గని కునాల్ కమ్ర.. Hawa Hawai అంటూ నిర్మలాసీతారామన్‌పై సెటైర్
Kunal kamra: స్టాండప్ కమెడియన్ Kunal Kamra మరోసారి రచ్చ లేపాడు. ఇప్పటికే గద్దర వ్యాఖ్యలతో మూడు ఎఫ్.ఐ.ఆర్‌లను ఎదుర్కొంటున్న అతను ఇప్పుడు Hawa Hawai అంటూ నిర్మలా సీతారామన్‌పై సెటైర్ వేశాడు.

Kunal Kamra on Nirmala: స్టాండప్ కమెడియన్ Kunal Kamra గద్దర్ (Gaddar) వ్యాఖ్యలపై ఓ పక్క గొడవ జరుగుతుండగా.. ఆయన ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. కునాల్ 'గద్దర్' వ్యాఖ్యలు మహరాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను ఉద్దేశించినవే అనే రచ్చ జరుగుతోంది. ఆ పార్టీ కార్యకర్తలు.. కునాల్ ఆఫీసుపై దాడి కూడా చేశారు. అయితే ఆయన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశించి చేసినట్లుగా చెబుతున్న మరో వీడియో ఇప్పుడు వివాదానికి దారి తీస్తోంది. ె
వెనక్కి తగ్గని కునాల్
ఏక్‌నాథ్ షిండే పై వ్యాఖ్యల తర్వాత అంత రచ్చ జరిగినా కూడా ఈ స్టాండప్ కమెడియన్ వెనక్కు తగ్గడం లేదు. మరో వీడియోతో ఈ సారి నిర్మలా సీతారామన్‌ను టార్గెట్ చేశాడు. తన తాజా వీడియోలో Mr.India మూవీలోని ఫేమస్ Hawa Hawai సాంగ్‌ను కునాల్ తనదైన శైలిలో స్పూఫ్ చేశాడు. కేంద్రం పన్నులతో మధ్య తరగతిని పిండేస్తోందని వ్యంగ్యంగా పాట రూపంలో చెప్పాడు. ఈ పాటలో శాడీ వాలీ దీదీ… నిర్మల తాయీ అనేవి కచ్చితంగా ఆర్థిక మంత్రిని ఉద్దేశించినవే అని అర్థం అవుతోంది. ఈ వీడియో కొద్దిసేపటి క్రితమే తన ఇన్‌స్టాగ్రమ్‌లో పెట్టాడు.
View this post on Instagram
పోలీసు కేసులు, తీవ్రమైన రాజకీయ ఒత్తిడి ఉన్నా కూడా కునాల్ తన దైన మార్క్ వ్యంగ్యం నుంచి ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. మహరాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఏక్‌నాథ్‌షిండే ఉద్దేశించినట్లుగా ఉన్న Gaddar వీడియో రెండు రోజులుగా మహరాష్ట్రలో తీవ్ర అలజడి సృష్టించింది. మొదట్లో శివసేన నేతగా ఉన్న ఏక్‌నాథ్ షిండే ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేసి అప్పటి సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టారు. బీజేపీ మద్దతుతో 2022లో తానే సీఎం అయ్యారు. ఆయన పార్టీనే అసలైన శివసేనగా తర్వాత గుర్తించారు. మళ్లీ మొన్న జరిగిన మహరాష్ట్ర ఎన్నికల్లో షిండే ఫడ్నవిస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా చేరారు. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆయనపై ఈ కామెంట్లు చేశారు. ఈ కామెంట్ల తర్వాత షిందే అభిమానులు, శివసేన కార్యకర్తలు కునాల్ స్టాండప్ థియేటర్‌పై దాడి చేసి ధ్వంసం చేశారు. అతనిపై ౩ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదయ్యాయి.
మొదటి నుంచి కునాల్ కమ్రా (Kunal kamra) ఎన్డీఏ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ.. కామెడీ వీడియోలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ ఆర్థిక విధానాలను ప్రశ్నిస్తూ చేసిన తాజా వీడియో ఈ వివాదాన్ని మరింత పెంచేలా ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

