Nirmala Sitharaman Budget Day Saree | నిర్మలా సీతారామన్ కట్టుకున్న చీరకు ఇంత హిస్టరీ ఉంది | ABP Desam
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసేందుకు వెళ్లిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ట్యాబ్ ను మీడియాకు చూపించారు. ఏటా బడ్జెట్ లానే ఈసారి కూడా నిర్మలా సీతారామన్ కట్టుకున్న చీరపై చర్చ జరిగింది. నిర్మలా సీతారామన్ కట్టుకున్న చీర మధుబని ఆర్ట్ కి ఓ ట్రిబ్యూట్ అని ప్రకటించారు. బిహార్ కు చెందిన దులారీ దేవి మధుబని ఆర్ట్ ను విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేశారు. అందుకు గానూ ఆమెకు 2021లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ గౌరవాన్ని అందించింది. గతంలో మధుబని ఆర్ట్ గురించి తెలుసుకునేందుకు నిర్మలా సీతారామన్ మిథిలా ఆర్ట్ ఇని స్టిట్యూట్ కి వెళ్లినప్పుడు అక్కడ దులారీ దేవిని కలిశారు. ఆ సందర్భంగా దులారీ దేవి ఇచ్చిన మధుబని ఆర్ట్ శారీని ఆమె కృషికి ట్రిబ్యూట్ గా బడ్జెట్ రోజు ధరించారు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్





















