అన్వేషించండి

Kejriwal Telangana: తెలంగాణ పాలిటిక్స్‌లో క్రేజీ అప్‌డేట్‌.. పాదయాత్రకు రెడీ అవుతున్న కేజ్రీవాల్ !

తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరించాలని కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. అంబేద్కర్ జయంతి రోజు పాదయాత్ర చేయనున్నారు.


ఆమ్ ఆద్మీ పార్టీ ( AAP ) తెలంగాణపై దృష్టి కేంద్రీకరించింది. దక్షిణాదిలోనూ పార్టీని విస్తరించాలని నిర్ణయించుకున్న అరవింద్ కేజ్రీవాల్ ( Aravind Kejriwal ) త్వరలో తెలంగాణలో పర్యటిచే అవకాశాలు ఉన్నాయి.  ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కేజ్రీవాల్ హైదరాబాద్‌లోనే ( Hyderabad ) పాదయాత్ర నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ యువతతో పాటు మాజీ సివిల్ సర్వీస్ అధికారులను పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకునేందుకు ఆప్ ప్రయత్నాలు చేస్తోంది.  ఇందుకోసం తెలంగాణా సెర్చ్ కమిటీని క ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.

రంగు , నోట్లోకి మందు - ఆ ఎమ్మెల్యే హోలీ చూస్తే మైండ్ బ్లాంకే

తెలంగాణకు  ( Telangana ) ఆప్ తరపున బాధ్యతలను సోమ్‌నాథ్ భారతి చూస్తున్నారు. ఆయన చేరికలత ోపాటు పాదయాత్రలను ప్లాన్ చేస్తున్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ  పాదయాత్రలు ( Padayatra )  చేపట్టనున్నట్లు ఆమ్ ఆద్మీ వర్గాలు చెబుతున్నాయి.   తెలంగాణ లో షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కేసీఆర్ ( KCR ) ముందస్తుకు వెళ్తారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఈ కారణంగా కేజ్రీవాల్ ముందుగానే తెలంగాణపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. 

ఇదెక్కడి చోద్యం ! పారిపోవడానికి ప్రయత్నించి, ఆపై లాఠీ లాక్కుని ఆబ్కారీ ఎస్సైపై దాడి

ఇటీవల కేసీఆర్  ఢిల్లీ వెళ్లినప్పుడు ఆప్ అధినేత కేజ్రీవాల్ ను కలుస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఎలాంటి భేటీ నిర్వహించలేదు. ఆ తర్వాత ఆప్ నేత సోమ్‌నాథ్ భారతి ( Somanath Bharti ) కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన అవినీతి పై విచారణ జరగకుండా తనను తాను కాపాడుకునేందుకు ఢిల్లీ వచ్చారని ఆరోపించారు. ఈ ప్రకటనతో కేజ్రీవాల్, కేసీఆర్ మధ్య రాజకీయ సంబంధాలు అస్సలు లేవన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే తెలంగాణలో ఆప్ అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. 

బండికి ఆ పని తప్ప వేరేది తెల్వదు, కమలాకర్‌పై పోటీ చేసి గెలవగలరా? కేటీఆర్ ఛాలెంజ్‌

ఆప్ తెలంగాణలో అడుగు పెట్టాలన్న వ్యూహంలో మరో కోణం కూడా ఉందని భావిస్తున్నారు. పంజాబ్ విజయం తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు ( Congress ) ప్రత్యామ్నాయం  తామేనని ఆమ్ ఆద్మీ భావిస్తోంది. ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాస్త బలంగా ఉంది. పోటీ ఇచ్చే స్థితిలోఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్‌ను దెబ్బకొడితే ఆ స్థానం తమకు వస్తుందని.. ఆప్ అంచనాలు వేస్తున్నట్లుగా భావిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jana Nayagan : విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - విడుదలకు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - విడుదలకు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
West Bengal: ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మద్య తీవ్రమైన వార్‌!
ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మద్య తీవ్రమైన వార్‌!
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Google Chrome Hidden Tools : Chrome వాడుతున్నారా? ఈ హిడెన్ ఫీచర్‌లు మీకు తెలుసా?
Chrome వాడుతున్నారా? ఈ హిడెన్ ఫీచర్‌లు మీకు తెలుసా?

వీడియోలు

Hardik Pandya in Vijay Hazare Trophy | సెంచరీ చేసిన హార్దిక్
Tilak Varma Injured | తిలక్ వర్మకు గాయం ?
Sarfaraz Khan vs Abhishek Sharma | 6 బంతుల్లో 6 బౌండరీలు బాదిన సర్ఫరాజ్
Sanjay Manjrekar Comments on Virat Kohli | విరాట్ పై సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్
Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jana Nayagan : విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - విడుదలకు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - విడుదలకు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
West Bengal: ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మద్య తీవ్రమైన వార్‌!
ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మద్య తీవ్రమైన వార్‌!
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Google Chrome Hidden Tools : Chrome వాడుతున్నారా? ఈ హిడెన్ ఫీచర్‌లు మీకు తెలుసా?
Chrome వాడుతున్నారా? ఈ హిడెన్ ఫీచర్‌లు మీకు తెలుసా?
Andhra Pradesh Weather Update: సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
KCR : మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
The Raja Saab OTT : 'ది రాజా సాబ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్! - ఆ ఛానల్‌లో చూడొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
'ది రాజా సాబ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్! - ఆ ఛానల్‌లో చూడొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
Embed widget