By: ABP Desam | Updated at : 18 Mar 2022 01:59 PM (IST)
ఎమ్మెల్యే శంకర్ నాయక్ హోలీ వేడుకల్లో మద్యం
హోలి ( Holi ) అంటే రంగులు చల్లుకోవడమే మనం అందరం అనుకుంటాం. కానీ మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కుకు ( MLA Sankar Naik ) హోలీ అంటే ఇంకో సంబరం కూడా ఉంది. అదేమిటంటే.. అనుచరులకు స్వయంగా నోట్లో మద్యం పోయడం. హోలీ సందర్భంగా మహబూబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ( MLA Camp Office ) సంబరాలు ఏర్పాటు చేశారు శంకర్ నాయక్. నియోజకవర్గం మొత్తం నుంచి అనుచరుల్ని ఆహ్వానించారు. క్యాంప్ ఆఫీసులో ఘనమైన ఏర్పాట్లు చేశారు. అంటే రంగులు.. నీళ్లు మాత్రమే కాదు.. తీర్థం కూడా. అంటే మద్యం అన్నమాట.
తెల్లారేసరికల్లా ఆర్టీసీ ప్రయాణికులకు షాక్, టికెట్ ధరలు పెంచిన టీఎస్‌ఆర్టీసీ
ఎమ్మెల్యేనే రంగులు పూసుకుందాం అని ఆహ్వానించిన తర్వాత రాకుండా ఉంటారా... వందల మంది అనుచరులు వచ్చారు. వీరిలో ఎక్కువ మంది స్థానిక ప్రజా ప్రతినిధులు. ఎంపీటీసీలు, పంచాయతీ వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు ఇలా అందరూ ఉన్నారు. అందరితో కలిసి హోళీ అడిన శంకర్ నాయక్ డాన్సులు కూడా వేశారు. అయిపోయిన తర్వాత ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని నిర్ణయించుకుని.. క్యాంప్ ఆఫీసులో అప్పటికే తెచ్చి ఉంచిన మద్యం బాటిళ్లను ( Liqour ) ఓపెన్ చేశారు. అనుచరులు ఒక్కొక్కరుగా నోరు తెరుస్తూంటే.. వారి నోళ్లలో ఆయన మద్యం పోస్తూ పోయారు.
ఇదెక్కడి చోద్యం ! పారిపోవడానికి ప్రయత్నించి, ఆపై లాఠీ లాక్కుని ఆబ్కారీ ఎస్సైపై దాడి
బాటిల్ ఓపెన్ చేసి అలా మద్యాన్ని నోట్లో పోయడం చూసిన చాలా మంది సినిమాల్లో ఐటం సాంగ్‌లను గుర్తు చేసుకున్నారు. అక్కడ ఎవరూ అలా మద్యం తాగడాన్ని ఎమ్మెల్యే స్వయంగా పోయడాన్ని తప్పు పట్టలేదు. డాన్స్ లేస్తూ చిందులేస్తూ.. పండగ చేసుకున్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా వారితో కాలు కలిపారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో పాటు మందుమత్తులో చిందేసి , తూలిపోయారు ప్రజా ప్రతినిధులు .
ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు వివాదాలేం కొత్త కాదు. ఆయన చుట్టూ ఎప్పుడూ వివాదాల్లేకపోతేనే కొత్తగా ఉంటుంది. ప్రభుత్వ ఆఫీసులకెళ్లి అధికారుల కుర్చీల్లో కూర్చోవడం.. లాంటి పనులే కాదు.. ఏకంగా మహిళా కలెక్టర్‌తోనూ అనుచితంగా ప్రవర్తించిన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎన్ని ఉన్నా ఆయన రాజకీయాలు ఆయన చేస్తూనే ఉన్నారు.
Uttam Kumar Reddy: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు దారుణం, ఆయన వల్ల సర్పంచ్ల ఆత్మహత్యలు: టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్
KTR UK Tour: లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
Breaking News Live Updates : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ విజేతగా భారత్
Telangana: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ - ఎవరికి ఏ శాఖ అప్పగించారంటే !
Politics With Mogulaiah : మొగులయ్య పావుగా బీజేపీ , టీఆర్ఎస్ రాజకీయాలు ! ఆ వీడియోలతో హల్ చల్
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!