Jr NTR - Lakshmi Pranathi : జపాన్లో సెలబ్రేషన్స్... భార్య బర్త్ డేకి ఎన్టీఆర్ లవ్లీ సర్ప్రైజ్... ప్రణతిని తారక్ ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా?
Jr NTR - Lakshmi Pranthi : ఎన్టీఆర్ నటించిన 'దేవర' మూవీ జపాన్లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇప్పుడు తన సతీమణితో జపాన్ లో ఉన్న ఎన్టీఆర్ ఆమె బర్త్ డేను అక్కడే సెలబ్రేట్ చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' సినిమా ప్రమోషన్ల కోసం జపాన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తన భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజును అక్కడే స్పెషల్ గా సెలబ్రేట్ చేశారు. దానికి సంబంధించిన ఫోటోలను ఎన్టీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇప్పుడు అవి తెగ వైరల్ అవుతున్నాయి.
జపాన్ లో లక్ష్మీ ప్రణతి బర్త్ డే సెలబ్రేషన్స్
ఎన్టీఆర్ సోషల్ మీడియాలో తన భార్య పుట్టినరోజు సెలబ్రేషన్స్ కు సంబంధించి రెండు ఫోటోలను పోస్ట్ చేశారు. వాటిలో ఒకదాంట్లో లక్ష్మీ ప్రణతిని ఆయన హృదయపూర్వకంగా చిరునవ్వుతో కౌగిలించుకోవడానికి ఆహ్వానించడం కనిపిస్తోంది. ఇక రెండవ పిక్ లో ఇద్దరూ దగ్గరగా, సంతోషంగా కనిపించారు. ఈ బర్త్ డే డేట్ నైట్ ను మరింత స్పెషల్ గా చేయడానికి ఎన్టీఆర్ - లక్ష్మీ ప్రణతి ఇద్దరూ బ్లాక్ కలర్ డ్రెస్ థీమ్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ఎన్టీఆర్ ఈ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ "అమ్మలు... పుట్టినరోజు శుభాకాంక్షలు" అని క్యాప్షన్ రాశారు. దీంతో ఎన్టీఆర్ తన భార్యని ముద్దుగా 'అమ్మలు' అని పిలుస్తాడనే విషయం ఈ పోస్ట్ తో వెల్లడైంది.
జూనియర్ ఎన్టీఆర్ - లక్ష్మీప్రణతి 2011లో హైదరాబాద్లో పెద్దల ఆశీర్వాదంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిది పెద్దలు కుదిరిచిన వివాహం కావడంతో పెళ్లయ్యాకే ఇద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ, బలమైన బంధాన్ని ఏర్పరచుకున్నారు. ఎన్టీఆర్ కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా లక్ష్మీ ప్రణతికి ఈ లైమ్ లైట్ లోకి రావడం కాస్త కష్టంగా అనిపించవచ్చు. కానీ ఎన్టీఆర్ ఆమెకు కంప్లీట్ గా సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు. ఈ జంట 2014లో అభయ్ రామ్, 2018 లో భార్గవ రామ్ లకు తల్లిదండ్రులు అయ్యారు. ఇక ఎన్టీఆర్ తన పర్సనల్ లైఫ్ ని ప్రైవేట్ గా ఉంచడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అంతేకాకుండా తన ఫ్యామిలీతో ఎక్కువగా క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తారు.
Also Read: ఎవరీ చరణ్ దేవినేని? రాముడి వెంట లక్ష్మణుడిలా... ఎన్టీఆర్ వెంట జపాన్ వెళ్ళినోడు!
ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ మూవీ నెక్స్ట్ షెడ్యూల్
ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఎన్టీఆర్ 'దేవర' సినిమాను జపాన్లో ప్రమోట్ చేస్తున్నారు. గత ఏడాది ఇండియాలో రిలీజ్ అయిన 'దేవర' మూవీ 500 కోట్ల భారీ కలెక్షన్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఈనెల 28న జపాన్ లో ఈ మూవీ థియేటర్లలోకి రాబోతోంది. ఇదివరకే 'దేవర' ప్రీమియర్స్ జపాన్లో వెయ్యగా, వాటికి తారక్ తో పాటు డైరెక్టర్ కొరటాల శివ కూడా హాజరయ్యారు. ఇప్పుడు మరోసారి ప్రమోషన్ల కోసం ఎన్టీఆర్ సతీసమేతంగా జపాన్ కి వెళ్లడం విశేషం. ఈ మూవీ ప్రమోషన్ల అనంతరం జపాన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ని బెంగళూరులో ప్లాన్ చేశారు.
View this post on Instagram





















