అన్వేషించండి

Pooja Hedge: కోట్లు ఖర్చు పెట్టి నన్ను ట్రోల్ చేస్తున్నారు... బాంబ్ పేల్చిన బుట్టబొమ్మ

Pooja Hedge : హీరోయిన్ పూజా హెగ్డే ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చాలా డబ్బు ఖర్చు పెట్టి, తనపై నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే ఇప్పుడిప్పుడే మళ్ళీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డబ్బులు ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్ ప్రచారం చేయడానికి చాలా డబ్బు తగలేస్తున్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. 

కావాలనే పూజ హెగ్డేను టార్గెట్ చేశారా? 
పూజా హెగ్డే ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తనకు జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించింది. సామాజిక మాధ్యమాలలో తన గురించి ఎన్నో రకాలుగా వచ్చిన ట్రోలింగ్స్ తనను, తన కుటుంబాన్ని బాధ పెట్టాయని ఆవేదనను వ్యక్తం చేసింది. అంతేకాకుండా నటిగా తన ఎదుగుదలను దెబ్బ కొట్టడానికి కొంతమంది కోట్ల రూపాయలు ఇచ్చి ట్రోలింగ్ చేయించారని ఈ సందర్భంగా పూజ హెగ్డే సంచలన విషయాన్ని బయట పెట్టింది. తనపై వచ్చిన ఆ ట్రోలింగ్ ని చూసి తన తల్లిదండ్రులు ఎంతగానే బాధపడ్డారని ఆమె వెల్లడించింది. అయితే ఒకానొక టైంలో తనపై భారీగా ట్రోలింగ్ జరుగుతుండడంతో అసలేం జరుగుతుందో కనుక్కోమనని తన టీంని పురామాయించిందట పూజా. 

వాళ్ళు కొన్ని మీమ్ పేజెస్ ను సంప్రదించగా, "మిమ్మల్ని ట్రోల్ చేయడానికి ఇంత పే చేస్తున్నారు. మీరు గనక ఈ ట్రోలింగ్ ని ఆపాలన్నా, లేదంటే తిరిగి ఫైట్ చేయాలన్నా ఇంత ఖర్చవుతుంది" అని మొహం మీద చెప్పేశారట. ఇదంతా తెలుసుకున్న తర్వాత ట్రోలింగ్ ను పట్టించుకోవడం మానేశానని, ఇప్పుడు తన దృష్టి పూర్తిగా సినిమాలపైనే ఉందని వెల్లడించింది పూజా. అయితే తాను ఎవ్వరికీ ఎలాంటి చెడు చేయలేదని, అయినప్పటికీ ఎందుకు తనపై ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారో తెలియట్లేదని ఆవేదనను వ్యక్తం చేసింది. కానీ తనను టార్గెట్ చేయడానికి ట్రోలర్స్ కి భారీగా డబ్బును ఖర్చుపెట్టిన వ్యక్తి ఎవరు? అన్న విషయాన్ని మాత్రం పూజా బయట పెట్టలేదు. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీలో పూజా హెగ్డే ఎవరిని బ్లేమ్ చేస్తోంది? ఆమెను టార్గెట్ చేసింది ఎవరు? అన్నది చర్చకు దారి తీసింది. 

హిందీ, తమిళ సినిమాలతో బిజీ
ఇదిలా ఉండగా ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తోంది. కెరీర్ మొదట్లోనే మంచి అవకాశాలు పట్టేసిన పూజా హెగ్డేకి బ్రేక్ ఇచ్చింది మాత్రం టాలీవుడ్డే. 'డీజే' సినిమా తర్వాత ఈ అమ్మడికి తెలుగులో స్టార్ హీరోల సరసన నటించే మరిన్ని అవకాశాలు వచ్చాయి. వాటిని ఉపయోగించుకొని ఈ బ్యూటీ పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగింది. కానీ అలాంటి సమయంలోనే సడన్ గా కెరీర్ లో డౌన్ ఫాల్ చూసింది. ఒకానొక టైంలో ఇక పూజ హెగ్డే పని అయిపోయినట్టే అనుకున్నారు అందరూ. కానీ మరోసారి పూజా హెగ్డే వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. కోలీవుడ్లో 'జననాయగన్', 'రెట్రో' వంటి స్టార్ హీరోల సినిమాలు చేస్తోంది. అలాగే 'కాంచన 4', రజనీకాంత్ 'కూలి' సినిమాల్లో అవకాశం దక్కించుకుంది. హిందీలో మరో సినిమా చేస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Mirai Japan Advance Booking: జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
Toxic Actor Yash: నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
Allu Arjun On Chiranjeevi Birthday: కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget