Jr NTR: ఎవరీ చరణ్ దేవినేని? రాముడి వెంట లక్ష్మణుడిలా... ఎన్టీఆర్ వెంట జపాన్ వెళ్ళినోడు!
Charan Devineni: చరణ్ దేవినేని... ఇప్పుడీ పేరు ప్రేక్షకుల్లో పాపులర్ అవుతోంది. ఎన్టీఆర్ వెంట ఆయన జపాన్ వెళ్లారు. అంతే కాదు... అతని బర్త్ డేకి ఎన్టీఆర్ స్పెషల్ విషెష్ చెప్పారు. అసలు ఎవరీ చరణ్ దేవినేని?

చరణ్ దేవినేని (Charan Devineni)... మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man Of Masses NTR) అభిమానులతో పాటు ప్రేక్షకులందరి చూపు అతని మీద ఉంది. ఎవరీ చరణ్ దేవినేని? ఆరాలు తీయడం మొదలు పెట్టారు. అందుకు కారణం ఎన్టీఆరే. ఆయన ఏం చేశారు? ఈ చరణ్ ఎవరు? వంటి వివరాల్లోకి వెళితే...
ఎన్టీఆర్ వెంట జపాన్ వెళ్లిన లక్ష్మణుడు!
Devara Japan Release Date: 'దేవర: పార్ట్ 1'ను జపనీస్ భాషలో డబ్బింగ్ చేశారు. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' చిత్రానికి, అందులో కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ నటనకు జపాన్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో 'దేవర'ను సైతం అక్కడ విడుదల చేస్తున్నారు. ఈ నెల 28న జపాన్ ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకు వెళుతున్నారు. ఆల్రెడీ వేసిన ప్రీమియర్ షో సూపర్ రెస్పాన్స్ అందుకుంది. 'దేవర' ప్రచార కార్యక్రమాల కోసం జపాన్ వెళ్లిన ఎన్టీఆర్ వెంట చరణ్ దేవినేని కూడా వెళ్లారు.
ఎన్టీఆర్ సతీమణి ప్రణతి పుట్టిన రోజు ఇవాళ (మార్చి 26). ఈ రోజే చరణ్ దేవినేని పుట్టిన రోజు కూడా. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ప్రణతికి బర్త్ డే విషెస్ చెప్పారు ఎన్టీఆర్. అయితే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చరణ్ దేవినేనితో జపాన్ లో దిగిన ఫోటోలను షేర్ చేసిన ఎన్టీఆర్... ''హ్యాపీ బర్త్ డే తమ్ముడు. మై ఎవ్రీడే లక్ష్మణుడు'' అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు. ఆ తారక రాముడు తన లక్ష్మణుడు అని పేర్కొన్నది ఎవరిని? అనే ఆసక్తి ప్రేక్షకులలో మొదలైంది.
ఎవరీ చరణ్ దేవినేని? అంత క్లోజ్ ఫ్రెండా?
హైదరాబాద్ సిటీలోని టెనెట్ డయాగ్నొస్టిక్ సెంటర్ ఉంది కదా! అది తెలుసా? మెడికల్ టెస్ట్స్ చేయడంలో చాలా పాపులర్. ఆ టెనెట్ ఓనర్ చరణ్ దేవినేని అని తెలిసింది. ఆ సంస్థకు ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఎన్టీఆర్ అంటే అతనికి చాలా అభిమానం. అంతకు మించి గౌరవం. ఎన్టీఆర్ సన్నిహితులలో చరణ్ దేవినేని ఒకరు. షూటింగ్స్ ఏవీ లేకుండా హైదరాబాద్ సిటీలో గనక ఎన్టీఆర్ ఉంటే... తప్పకుండా తరచూ కలిసే వ్యక్తులను చరణ్ దేవినేని కూడా ఉంటారని తారక్ సన్నిహితులు చెప్పే మాట. ఇప్పుడు ఎన్టీఆర్ ప్రణతి దంపతులతో పాటు చరణ్ దేవినేని కూడా జపాన్ లో ఉన్నారు.
Also Read: 'రాబిన్‌హుడ్' ఫస్ట్ రివ్యూ... ఫస్టాఫ్ కామెడీ, సెకండాఫ్ ఎమోషనల్... టాక్ ఎలా ఉందంటే?
Jr NTR Upcoming Movies: ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే... ఆయన హీరోగా నటిస్తున్న మొదటి హిందీ స్ట్రెయిట్ సినిమా 'వార్ 2' చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అందులో హృతిక్ రోషన్ మరొక హీరో. 'దేవర' ప్రచార కార్యక్రమాల నిమిత్తం ఆ సినిమా చిత్రీకరణకు కాస్త విరామం ఇచ్చారు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందుతున్న 'డ్రాగన్' సినిమా చిత్రీకరణ మొదలైంది. అయితే ఇంకా ఎన్టీఆర్ జాయిన్ కాలేదు. జపాన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సీక్వెల్ చేయాల్సి ఉంది. 'వార్ 2', 'డ్రాగన్' తర్వాత ఆ సినిమా చేస్తారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

