Chiranjeevi: చిరంజీవి - అనిల్ సినిమా ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు... పండక్కి స్పెషల్ ప్లాన్?
Chiranjeevi Anil Ravipudi Movie: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయ్యిందని సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా వరుస విజయాలతో దూసుకు వెళుతున్న అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయిందని ఫిలింనగర్ వర్గాల ద్వారా తెలిసింది. ఆ వివరాల్లోకి వెళితే....
ఉగాది పండక్కి కొబ్బరికాయ కొడతారా?
తెలుగు ప్రజలకు ఇష్టమైన పండుగలలో ఉగాది (Ugadi 2025) ఒకటి. మన హిందూ సంప్రదాయం ప్రకారం నూతన సంవత్సరం ప్రారంభం అయ్యేది ఆ రోజే. ఫెస్టివల్ స్పెషల్ కింద... ఏప్రిల్ 30వ తేదీన చిరంజీవి - అనిల్ రావిపూడి (Chiranjeevi Anil Ravipudi Movie) సినిమా ప్రారంభోత్సవం చేయనున్నారని సమాచారం. పండక్కి కొబ్బరికాయ కొడతారని తెలిసింది.
ఉగాదికి ప్రారంభమైనా... వేసవి తర్వాతే!
సినిమాను ఉగాదికి ప్రారంభించినా... సెట్స్ మీదకు వెళ్ళేది మాత్రం వేసవి తర్వాతే అని తెలిసింది. ఎండలు తగ్గిన తర్వాత రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారట. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడానికి కొంత సమయం ఉంది కనుక... ఈ లోపు తన చేతిలో ఉన్న 'విశ్వంభర' (Vishwambhara Movie) పనులు అన్నిటినీ పూర్తి చేయడానికి చిరు ప్లాన్ చేశారట.
సంక్రాంతి సెంటిమెంట్ కంటిన్యూ... నో డౌట్!
Chiru Anil Movie Release Date: సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా విడుదల అయితే సూపర్ హిట్ అనే ఒక సెంటిమెంట్ ఉంది. విక్టరీ వెంకటేష్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై భారీ విజయం సాధించింది. 300 కోట్ల రూపాయల క్లబ్బులో ఆ సినిమా చేరింది. అంతకు ముందు సైతం సంక్రాంతికి వచ్చిన అనిల్ రావిపూడి సినిమాలో భారీ వసూళ్ళను సాధించడంతో పాటు ప్రేక్షకులను, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను మెప్పించాయి.
Also Read: 'రాబిన్‌హుడ్' ఫస్ట్ రివ్యూ... ఫస్టాఫ్ కామెడీ, సెకండాఫ్ ఎమోషనల్... టాక్ ఎలా ఉందంటే?
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న సినిమాను సైతం వచ్చే ఏడాది (2026) సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ ఆయన కొన్ని ట్యూన్స్ కూడా ఇచ్చారట.
చిరు సరసన నటించే హీరోయిన్ ఎవరు?
Who is the heroine of Chiranjeevi Anil Ravipudi movie?: అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్ గురించి ఇప్పుడు పెద్ద డిస్కషన్ నడుస్తోంది. చిరంజీవి సరసన నటించిన కథానాయిక పాత్ర కోసం అన్వేషణ కొనసాగుతోంది. మొదట హైదరాబాదీ అమ్మాయి, బాలీవుడ్ సినిమాలతో పేరు తెచ్చుకున్న అదితి రావు హైదరి యాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని వినిపించింది. ఆ తరువాత మిల్కీ బ్యూటీ తమన్నా పేరు కూడా తెరపైకి వచ్చింది. 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో తమన్నాతో చిరంజీవి నటించారు. అయితే అదితీతో ఇప్పటి వరకు ఒక సినిమా కూడా చేయలేదు. వీళ్ళిద్దరి తర్వాత వెంకటేష్ సరసన భాగ్యం పాత్రలో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో మెప్పించిన ఐశ్వర్య రాజేష్ పేరు కూడా తెరపైకి వచ్చింది. మరి ఈ ముగ్గురిలో ఎవరు ఫైనలైజ్ అవుతారో చూడాలి.





















