L2 Empuraan: 'లూసిఫర్ 2'లో రిక్ యున్... గ్రోక్ కూడా కనిపెట్టలేకపోయిన ఈ హాలీవుడ్ యాక్టర్ ఎవరో తెలుసా? ఆయన బ్యాగ్రౌండ్ ఇదే
L2 Empuraan : మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న 'L2 ఎంపురాన్'లో హాలీవుడ్ నటుడు రిక్ యున్ భాగం కాబోతున్నారనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆయన ఎవరు? రిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా ?

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన 'L2: ఎంపురాన్' అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మార్చి 27న విడుదల కానుంది. ఈ యాక్షన్-థ్రిల్లర్ విడుదలకు ముందు రిక్ యున్ ఈ మూవీలో ఓ పాత్ర పోషించాడనే విషయం బయటకు వచ్చింది. అయితే ఇందులో ఆయన చేయబోయే పాత్ర ఏమిటి? అన్న విషయాన్ని సస్పెన్స్ లో ఉంచారు మేకర్స్. ఇక ప్రేక్షకులు ఆయన పాత్ర ఏంటి అన్న విషయాన్ని తెరపై చూసి తెలుసుకోవాలి. అంతలోగా ఈ రిక్ ఎవరు? ఆయన బ్యాగ్రౌండ్ ఏమిటి? అనే విషయాలను ఆరా తీయడం మొదలు పెట్టారు నెటిజన్లు. ఆయనొక పాపులర్ హాలీవుడ్ నటుడు.
రిక్ యున్ బ్యాగ్రౌండ్ ఇదే
రిక్ యున్ కొరియన్ సంతతికి చెందిన అమెరికన్ నటుడు. ఈ నటుడు 'స్నో ఫాలింగ్ ఆన్ సెడార్స్' అనే చిత్రంతో సినిమా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశాడు. తరువాత 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' ఫ్రాంచైజీ మొదటి భాగంలో కీలక పాత్రను పోషించాడు. విన్ డీజిల్, పాల్ వాకర్ కలిసి నటించిన 'ది ఫాస్ట్ అండ్ ది ఫ్యూరియస్'లో ఈ నటుడు వియత్నామీస్ ముఠా నాయకుడు, డోమ్ శత్రువు అయిన జానీ ట్రాన్ అనే పాత్రలో నటించాడు. అంతేకాదు రిక్ సినిమాలతో పాటు పలు సూపర్ హిట్ సిరీస్ లలో కూడా నటించాడు. ఆ లిస్ట్ లో పియర్స్ బ్రాస్నన్ డై అనదర్ డే, 'ఒలింపస్ హాస్ ఫాలెన్, అలిటా: బాటిల్ ఏంజెల్, ప్రిజన్ బ్రేక్, నెట్‌ఫ్లిక్స్ 'మార్కో పోలో' వంటి సిరీస్ లతో పాటు మరెన్నో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆయన 'L2: ఎంపురాన్' సినిమాలో రిక్ ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించే అవకాశం ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఒకవేళ ఈ వార్తలు గనుక నిజమైతే రిక్ యున్ మొట్టమొదటి ఇండియన్ సినిమా ఇదే అవుతుంది. కానీ నిర్మాతలు ఇంకా విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే మోహన్ లాల్ తాజాగా షేర్ చేసిన ఓ పోస్ట్ కారణంగా ఈ వార్త వైరల్ అవుతోంది. అందులో నటుడి ముఖాన్ని కనిపించకుండా డిజైన్ చేశారు.
అమీర్ ఖానా లేదంటే రిక్ యునా ?
ఈ సినిమా రిలీజ్ కు మరికొన్ని గంటలే ఉండగా చిత్ర బృందం ఇచ్చిన సర్ప్రైజ్ తో ప్రేక్షకుల్లో కన్ఫ్యూజన్ నెలకొంది. ఆ షాడో పోస్టర్ లో ఉన్నది ఎవరు ? అనే విషయంపై సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ కూడా నటించారని ప్రచారం జరుగుతోంది. తాజాగా విడుదలైన 'ఎంపురాన్' పోస్టర్ లో ఉన్నది అమీరేనని అంటున్నారు కొందరు. కాదు ఆయన రిక్ యున్ అంటున్నారు మరికొందరు. అయితే గ్రోక్ కూడా ఆయన ఎవరో కనిపెట్టలేకపోవడం గమనార్హం. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న 'L2: ఎంపురాన్' మూవీ ఉగాది కానుకగా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మలయాళంతో పాటు తెలుగు ఇతర దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

