అన్వేషించండి
Axar Patel Meha Marriage: పెళ్లివేడుకలో అక్షర్, మేహా పటేల్ జిగేల్! కొత్త జంట ఎంత బాగుందో చూడండి!
Axar Patel Meha Marriage: పెళ్లివేడుకలో అక్షర్, మేహా పటేల్ జిగేల్! కొత్త జంట ఎంత బాగుందో చూడండి!

అక్షర్ పటేల్, మెహా పటేల్
1/7

టీమ్‌ఇండియా క్రికెటర్ అక్షర్ పటేల్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి మెహాను పెళ్లి చేసుకున్నాడు. గురువారం రాత్రి అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది.
2/7

అత్యంత సన్నిహితులు, బంధువుల మధ్య వడోదరలో వీరి పెళ్లి వేడుక జరిగింది.
3/7

గురువారం రాత్రి నుంచి అక్షర్ పటేల్, మెహాకు సంబంధించి వీడియోలు వైరల్‌గా మారాయి. గురువారం రాత్రి అక్షర్ పటేల్ సన్నిహితుల మధ్య ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వచ్చాయి.
4/7

తన వివాహం గురించి ఈ టీమ్‌ఇండియా క్రికెటర్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు.
5/7

గతేడాది జనవరి 20న అక్షర్ పటేల్, మెహా నిశ్చితార్థం జరిగింది. అప్పట్నుంచి వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ తమ చిత్రాలను పంచుకున్నారు. గురువారం ఈ కొత్త జంట 'మన్ మేరీ జాన్' పాటకు నృత్యం చేస్తున్న వీడియో వైరల్ అయింది.
6/7

సౌరాష్ట్ర క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్, అతడి భార్య, మహ్మద్ కైఫ్ ఇతర సన్నిహితులు అక్షర్ పటేల్, మెహా వివాహానికి హాజరయ్యారు.
7/7

టీమ్‌ఇండియా క్రికెటర్లు వరుసగా పెళ్లి బాట పడుతున్నారు. మూడు రోజులు ముందే కేఎల్ రాహుల్, అతియా శెట్టి పెళ్లి పీటలు ఎక్కారు. ఇప్పుడు పటేల్ వంతు వచ్చింది.
Published at : 27 Jan 2023 01:22 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion