అన్వేషించండి
Rishabh Pant- Isha Negi love story: టీం ఇండియా డైనమిక్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ లవ్ స్టోరీ తెలుసా మీకు
Rishabh Pant : రిషబ్ పంత్, డైనమిక్ ఇండియన్ వికెట్ కీపర్, బంతిని బౌండరీలు దాటించే అద్భుతమైన బ్యాటర్ కూడా. ఈ విధ్వంసకర ఆటగాడి.. మనసు దోచుకున్న ఆ సుందరాంగి ఎవరో తెలుసా ?

గర్ల్ ఫ్రెండ్ ఇషా నాగితో రిషబ్ పంత్ (Photo Source :Instagram )
1/8

బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అద్భుత శతకంతో చెలరేగిన రిషభ్ పంత్.. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు.
2/8

గతంలో ఆస్ట్రేలియా గడ్డపై ఒంటి చేత్తో భారత్‌కు విజయాన్ని అందించిన పంత్..ఈసారి కూడా అలాంటి అద్భుతాలే చేస్తాడని అందరూ భావిస్తున్నారు.
3/8

మైదానంలో చాలా దూకుడుగా బ్యాటింగ్ చేసే పంత్ కి ఒక అందమైన ప్రేమ కధ ఉంది. బంతిని బౌండరీలు దాటించే ఈ విధ్వంసకర ఆటగాడి.. మనసు దోచుకున్న ఈ సుందరాంగి పేరు ఇషా నేగి
4/8

వీరిద్దరు సుమారు పడేళ్ళుగా డేటింగ్ చేస్తున్నారు. వారి ప్రేమకథ 2015లో పంత్ యొక్క అండర్-19 క్రికెట్ రోజుల్లో ప్రారంభమైంది.
5/8

2019లో ఆస్ట్రేలియాలో భారత్ చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయం తర్వాత పంత్ ఇషాతో తన బంధాన్ని గురించి బహిరంగంగా చెప్పాడు. అప్పట్లో ఈ జంట పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ క్రికెట్ అభిమానులలో సంచలనం సృష్టించింది.
6/8

ఇషా నేగి ఒక మోడల్, ఎంటర్‌ప్రెన్యూర్, అలాగే ఇంటీరియర్ డిజైనర్ కూడా. డెహ్రాడూన్‌కు చెందిన ఆమె జీసస్ & మేరీ కాన్వెంట్‌లో తన ప్రాధమిక విద్యను పూర్తి చేసి నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ నుండి డిగ్రీ తీసుకుంది.
7/8

మ్యాచ్‌ల సమయంలో పంత్ కి సపోర్ట్ గా ఉండటమే కాదు , కారు ప్రమాదం నుండి పంత్ కోలుకునే సమయంలో కూడా ఇషా అతని పక్కనే ఉంది
8/8

వీరిద్దరూ జంటగా మీడియా ముందు కనపడకపోయినప్పటికీ అప్పుడప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లలో ఇషా తళుక్కున మెరుస్తుంది. ప్రమాదం తర్వాత ఇషా చేసిన పోస్ట్ లో పంత్ ను "ఫైటర్" అని పేర్కొన్నడం అభిమానులను సైతం ఆకట్టుకుంది.
Published at : 04 Oct 2024 09:55 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
ఇండియా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion