అన్వేషించండి
Papaya Leaf Juice : బొప్పాయి ఆకులరసాన్ని పరగడుపున తీసుకుంటే ఎన్ని లాభాలో.. బ్లడ్ షుగర్ ఉన్నవారికి ఇంకా మంచిదట
Health benefits : బొప్పాయి పండులోనే కాదు. వాటి సీడ్స్, ఆకుల్లోనూ ఆరోగ్యానికి ప్రయోజనాలు అందించే గుణాలు ఉంటాయి. అందుకే బొప్పాయి ఆకులను రసం చేసి తీసుకుంటే హెల్త్‌కి చాలా మంచిదంటున్నారు.

బొప్పాయి ఆకుల రసం తాగితే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో(Images Source : Envato)
1/7

బొప్పాయి ఆకుల రసం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో విటమిన్లు ఏ, సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి.
2/7

ఈ ఆకుల రసంలో పాపైన్, ప్రోటీజ్ ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి మెరుగైన జీర్ణక్రియకు మద్ధతునిస్తాయి. అంతేకాకుండా ఐబీఎస్ లక్షణాలు తగ్గించి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
3/7

యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్‌తో నిండిన ఈ రసం ఆర్థరైటిస్‌ను కంట్రోల్ చేస్తుంది. గౌట్, ఇతర ఇన్ఫ్లమేటరీ లక్షణాలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా వాపును దూరం చేస్తుంది.
4/7

మధుమేహమున్నవారు దీనిని తీసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయి. ఈ విషయాన్ని కొన్ని అధ్యయనాలు నిరూపించాయి కూడా. అందుకే బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేయడానికి దీనిని కొందరు తీసుకుంటారు.
5/7

కాలేయ సమస్యలను అస్సలు ఇగ్నోర్ చేయకూడదు. ఒకవేళ మీరు కాలేయ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. దీనిని కచ్చితంగా తీసుకోవాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర సమ్మేళనాలు కాలేయాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి.
6/7

10-15 బొప్పాయి ఆకులు తీసుకుని.. దానిలో రెండు కప్పుల నీళ్లు వేసి జ్యూస్ చేయాలి. ఆ రసాన్ని వడకట్టి తాగవచ్చు. లేదంటే తేనె కలిపి కూడా తీసుకోవచ్చు. దీనిని ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.
7/7

ముఖ్య గమనిక ఏంటంటే.. దీనిని మీరు తీసుకోవాలనుకుంటే కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి. మెడికల్ సమస్యలు, అలెర్జీలు ఉంటే కచ్చితంగా నిపుణుల సలహాలు, సూచనలు తీసుకున్నాకే.. దీనిని తీసుకోవాలి.
Published at : 21 Aug 2024 07:16 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
నల్గొండ
హైదరాబాద్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion