Robinhood Movie: నితిన్ 'రాబిన్ హుడ్' టికెట్ ధరల పెంపు - ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన మూవీ టీం.. అసలు నిజం ఏంటో తెలుసా?
Robin Hood: నితిన్ 'రాబిన్ హుడ్' మూవీ టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంటూ వస్తోన్న విమర్శలపై చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పష్టత ఇచ్చింది.

Mythri Movie Makers Clarifies About Nithiin's Robin Hood Movie Ticket Hike In AP: యంగ్ హీరో నితిన్ (Nithiin) 'రాబిన్ హుడ్' (Robinhood) మూవీ టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంటూ వస్తోన్న వార్తలపై చిత్ర నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' స్పందించింది. అటు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వస్తోన్న విమర్శలకు వివరణ ఇచ్చింది.
అక్కడ మాత్రమే పెంపు
టికెట్ ధరల పెంపు రాష్ట్రంలోని అన్ని థియేటర్లకు వర్తించదని 'మైత్రీ మూవీ మేకర్స్' (Mythri Movie Makers) స్పష్టం చేసింది. మీడియా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని క్లారిటీ ఇచ్చింది. ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే టికెట్ ధరల పెంపు వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన జారీ చేసింది. సింగిల్ స్క్రీన్లలో జీఎస్టీతో కలిపి రూ.50, అదే మల్టీప్లెక్స్‌లో జీఎస్టీతో కలిపి రూ.75 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపింది. సినిమా రిలీజైన రోజు నుంచి 7 రోజులు ఈ టికెట్ ధరలు అమల్లో ఉంటాయని పేర్కొంది.
Explosive entertainment at affordable prices.#Robinhood pic.twitter.com/v8W5PZKXGa
— Mythri Movie Makers (@MythriOfficial) March 25, 2025
సాధారణ ధరల్లోనే..
''రాబిన్ హుడ్' చిత్రానికి టికెట్ ధరలు పెంచారంటూ వస్తోన్న వార్తలు నిరాధారమైనవి. అందుబాటు ధరల్లో ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందించడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. పెంచిన ధరలు ఏపీలో కొన్ని ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే అమలవుతాయి. మిగిలిన రాష్ట్రంతో పాటు, తెలంగాణలోనూ సాధారణ ధరల్లో టికెట్స్ లభిస్తాయి. మీ అభిమాన థియేటర్స్‌లో మూవీ చూసి ఎంజాయ్ చెయ్యండి' అంటూ ప్రకటనలో పేర్కొంది.
నితిన్ కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్‌గా..
ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూసేదిగా ఉంటుందని దర్శకుడు వెంకీ కుడుముల తెలిపారు. నితిన్ కెరీర్, తన కెరీర్‌లో అత్యుత్తమ చిత్రంగా నిలుస్తుందని చెప్పారు. 'శారీరక బలం కంటే మానసిక బలం గొప్పదని నమ్మే యువకుడే రాబిన్ హుడ్. తన అవసరం ఎవరికి ఉందో వారికి అండగా నిలబడతాడు. అతనికి అనాథ శరణాలయంతో ఉన్న సంబంధం ఏంటి.?. రకరకాల గెటప్స్ అలరిస్తాయి. ఇంట్రడక్షన్ సాంగ్ తర్వాత కథే మారిపోతుంది.' అని చెప్పారు.
'భీష్మ' వంటి హిట్ తర్వాత దర్శకుడు వెంకీ కుడుముల, నితిన్ కాంబోలో వస్తోన్న 'రాబిన్ హుడ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. నితిన్ సరసన శ్రీలీల నటిస్తుండగా.. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్ర పోషిస్తున్నారు. కేతిక శర్మ స్పెషల్ సాంగ్‌లో కనిపిస్తుండగా.. వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషించారు. క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో కనిపించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై.. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ మూవీని నిర్మించారు. ఈ నెల 28న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

