Viral News: సరదాగా MRI చేయించుకున్న మహిళ - రిపోర్టు చూసి ఆపరేషన్ కోసం పరుగులు
MRI: ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నానని ఆ మహిళ అనుకుంది. తనకు ఏ సమస్యా లేదని ఓ రిపోర్టు తీసి సోషల్ మీడియాలో పెట్టాలనుకుని ఎమ్మారై చేయించుకుంది. కానీ అక్కడే అసలు షాక్ తగిలింది.

MRI Just For Fun: సరదాగా వైద్య పరీక్షలు చేయించుకుంటే క్యాన్సర్ ఉన్నట్లుగా బయటపడింది. అమెరికాకు చెందిన ఓ మహిళకు ఇదే పరిస్థితి ఎదురయింది. చాలా వ్యాధులు ఆరోగ్య పరిస్థితులు ప్రారంభంలో తెలియవు. కాస్త ముదిరిపోయిన తర్వాత మాత్రమే తమలో ఏదో లోపం ఉందని గుర్తిస్తారు. అప్పటి వరకు వారు పూర్తిగా ఆరోగ్యంగా భావిస్తారు. ఒక మహిళ విషయంలో ఇదే జరిగింది. ఆమె బాగానే ఉందని అనుకుంటూ సరదాగా MRI (మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్) చేయించుకుంది. కానీ ఆ నివేదిక చూసి షాక్‌కు గురయింది.
సరదాగా చేయించుకున్న ఎమ్మారైలో బయటపడిన సంచలన నిజం
సారా బ్లాక్‌బర్న్ అనే మహిళ మంచి ఆరోగ్య సూత్రాలు పాటిస్తారు. క్రమబద్దమైన జీవనం సాగిస్తారు. తనకు బాగా నిద్ర వస్తోందని.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని భావిస్తూ ఉంటుంది. అయితే తనలో ఉన్న ఆరోగ్యాన్ని రిపోర్టుగా రికార్డు చేయించుకోవాలనుకుంది. సరదాగా ఎమ్మారై చేయించుకోవాలని నిర్ణయించుకుని ఇన్సూరెన్స్ పరిధిలోకి రాకపోయినా రెండున్నర వేల డాలర్లు అంటే మన రూపాయల్లో రెండు లక్షలకుపైగా ఖర్చు పెట్టి టెస్టులు చేయించుకుంది. ఇది శరీరంలోని అవయవాలన్నింటినీ కవర్ చేసే పూర్తి-శరీర స్కాన్. ఈ రకమైన MRI 60 నిమిషాల పరీక్షలో శరీరం గురించి మిలియన్ల కొద్దీ కణాలను విశ్లేషించి వ్యాధులను గుర్తించగలదు.
వెంటనే ప్లీహం తొలగించేందుకు ఆపరేషన్ తో నిలిచిన ప్రాణం
సారా బ్లాక్‌బర్న్ కుటుంబంలో కొంత మందికి క్యాన్సర్ ఉంది. అయితే అలాంటివి తన జోలోకి రావని ఆమె గట్టి నమ్మకంతో ఉన్నారు. నాలుగు రోజుల తర్వాత వచ్చిన రిపోర్టు చూసి ఆమె షాక్ కు గురయ్యారు. ఆమె ప్లీహం ఉబ్బిపోయిందని టెస్టుల్లో తేలింది. ప్లీహానికి రక్తాన్ని సరఫరా చేసే ధమనులు ఉబ్బుతాయి. ప్లీహము రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది . ఇన్ఫెక్షన్లు వంటివి రాకుండా చేస్తుంది. ఈ రిపోర్టు చూసిన వైద్యులు వైద్యులు ఆమెకు ప్లీహాన్ని తొలగించుకోమని సలహా ఇచ్చారు. ప్లీహము లేకుండా జీవించగలరు కాబట్టి వెంటనే ఆపరేషన్ చేశారు. రెండు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్న సారా చివరికి కోలుకున్నారు.
బయటకు బాగున్నా శరీరంలో అనేక మార్పులు
దీన్ని బట్టి అర్థమయ్యేదేమిటంటే.. మనం అంతా బాగున్నామని కాదు.. బాడీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. బయటపడేవరకూ మన దేశంలో రోగాలు పెరుగుతున్నాయని గుర్తించలేరు. అందుకే క్రమబద్ధంగా టెస్టులు చేయించుకోవాలని వైద్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు. ఇప్పటికే మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. హఠాత్తుగా గుండెపోటు వంటివి వస్తున్నాయి. ఈ క్రమంలో అందరూ టెస్టులు చేయించుకోవడం ఉత్తమం అని వైద్య నిపుణులు సలహాలిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

