అన్వేషించండి
Nuvvunte Naa Jathaga Serial Today February 25th Highlights : తండ్రిని బకరా చేసిన మిధున, కుమిలి ఏడుస్తున్న హరివర్దన్.. దేవాతో కలిసి అత్తారింటికి వెళ్తూ.. నువ్వుంటే నా జతగా హైలెట్స్ ఇవే
Nuvvunte Naa Jathaga Today Episode : అత్తారింటికీ వెళ్తూ పట్టరాని సంతోషంలో మిధున ఉంటుంది. మరో పక్క హరివర్దన్ ఏడుస్తూ ఉంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది.

నువ్వుంటే నా జతగా సీరియల్ ఈరోజు ఎపిసోడ్ (Images Source : JIO Hotstar)
1/10

దేవా ఫోన్ చేయడంతో ఇంటికి తీసుకెళ్తేనే డాక్యూమెంట్స్ గురించి చెప్తానని మిధున చెప్తుంది. దీంతో దేవా సీరియస్ అవుతాడు. వద్దనుకుంటే రావొద్దని చెప్తుంది.(Images Source : JIO Hotstar)
2/10

పురుషోత్తం అన్నకి డాక్యుమెంట్స్ చాలా అవసరం. కచ్చితంగా ఎలా అయినా వాటిని తీసుకోవాలని ఆలోచిస్తాడు దేవా. సరే వచ్చి తీసుకెళ్తాను అని దేవా అంటాడు. (Images Source : JIO Hotstar)
3/10

దేవా కోసం లోపలికి రెడీ అవుతుంది మిధున. దీంతో ఇంటి సభ్యులు మేమంతా నీతో ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వేంటి రెడీ అయ్యావని హరివర్దన్ అడుగుతాడు.(Images Source : JIO Hotstar)
4/10

దీంతో నేను మా అత్తారింటికీ వెళ్లిపోతున్నాను. మా ఆయన వచ్చి నన్ను తీసుకెళ్తాడు అని చెప్తుంది. (Images Source : JIO Hotstar)
5/10

నువ్వు ఇక్కడ మాతో ఉండిపోవడానికి రాలేదా అని అడిగితే.. చిన్న విషయాలకు అత్తారింట్లో గొడవలు అవుతాయి.ఈ మాత్రానికే వచ్చేస్తానా అంటూ మిధున అడుగుతుంది. దీంతో హరివర్దన్ నా కోసం వచ్చావనుకున్నాను అనగానే దేవా ఇంటికి వస్తాడు. (Images Source : JIO Hotstar)
6/10

బయట ఉండి హారన్ కొడతాడు. మా ఆయన వచ్చాడని మిధున అందరికీ చెప్తుంది. దీంతో నువ్వు ఇలా వచ్చావంటే ఇంట్లోకే రానిచ్చేవాడిని కాదంటూ హరివర్దన్ ఫీల్ అవుతాడు. నన్ను పుట్టింటికి దూరం చేయకండి అంటూ చెప్పి మిధున వెళ్లిపోతుంది. (Images Source : JIO Hotstar)
7/10

ఆదిత్య మిధునను పిలుస్తుంటే తల్లి అడ్డుకుని ఇంకా సిగ్గులేదా రా పిలుస్తున్నావ్ తనని. అయినా ఈ ఇంటికి రావడం మనదే తప్పు అంటూ తీసుకుని వెళ్లిపోతుంది. (Images Source : JIO Hotstar)
8/10

ఇంటికి వెళ్లేదారిలో మిధున కావాలనే దేవాను ఆటపట్టిస్తుంది. దేవాపై చేతులు వేసి కూర్చుంటే.. దేవా సీరియస్ అవుతాడు.(Images Source : JIO Hotstar)
9/10

సరే నేను మా ఇంటికి వెళ్లిపోతానంటూ మిధున మారాం చేస్తే దేవా బతిమాలుకుంటాడు. దారి మధ్యలో పానీ పూరి షాప్ చూపించి తిందామని చెప్తుంది. (Images Source : JIO Hotstar)
10/10

మరోవైపు కూతురు వెళ్లిపోయిన బాధలో హరివర్దన్ కుమిలి కుమిలి ఏడుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగింది.(Images Source : JIO Hotstar)
Published at : 25 Feb 2025 03:08 PM (IST)
Tags :
Love Mithuna Rowdy Marriage Judge Bhanu Telugu Entertainment Telugu Serials #telugu News Deva Nuvvunte Naa Jathaga Serial Nuvvunte Naa Jathaga Serial Today Nuvvunte Naa Jathaga Serial In Telugu Nuvvunte Naa Jathaga Serial Today Episode Nuvvunte Naa Jathaga Serial Today Promo Nuvvunte Naa Jathaga Promo Nuvvunte Naa Jathaga Serial Highlights Nuvvunte Naa Jathaga Serial Today February 25th Episodeమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
అమరావతి
హైదరాబాద్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion