Billionaires: ఇండియాలో పెరిగిన బిలియనీర్ల సంఖ్య - అంబాని, అదానీ.. నెంబర్ వన్ ఎవరో తెలుసా.. ?
Hurun Global Rich List 2025: భారత్ లో బిలియనీర్లు 284 మంది ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే 13 మంది పెరిగారు.

India gets 13 new billionaires : ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 తాజాగా వెల్లడించిన జాబితా ప్రకారం దేశంలో ఇప్పుడు 284 మంది బిలియనీర్లు ఉన్నారు, ఈ సంవత్సరం ఈ జాబితాలో కొత్తగా 13 మంది కొత్త పేర్లు చేరాయి. సంపద తగ్గినప్పటికీ, ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. గౌతమ్ అదానీ ఈ ఆర్థిక సంవత్సరంలో అనేక సవాళ్లు ఎదుర్కోవడంతో మొదటి స్థానంలో ఉండలేకపోయారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ 8.6 ట్రిలియన్ రూపాయల నికర విలువతో భారతదేశపు అత్యంత సంపన్న వ్యక్తిగా తన స్థానాన్ని నిలుపుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఆయన సంపద 1 ట్రిలియన్ తగ్గింది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తన సంపదలో 13 శాతం పెరుగుదలను చూసి 8.4 ట్రిలియన్ సంపదకు యజమాని అయ్యారు. భారతీయ బిలియనీర్ల మొత్తం సంపద 98 ట్రిలియన్ల రూపాయలుగా హురూన్ లెక్కించింది. ఇది భారతదేశ GDPలో దాదాపు మూడింట ఒక వంతు. సౌదీ అరేబియా మొత్తం ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువ. గత ఏడాది కాలంలో 284 మంది బిలియనీర్లలో 175 మంది వారి సంపద పెరిగింది, 109 మంది సంపద తగ్గింది.
జాబితాలో 90 మంది వ్యక్తులు ఆర్థిక రాజధాని ముంబైలోనే నివసిస్తున్నారు. అత్యధిక మంది బిలియన్లు షాంఘై, బీజింగ్‌లలో నివసిస్తున్నారు. మూడో స్థానం ముంబైది.
భారతదేశంలోని 10 మంది అత్యంత ధనవంతులు
ముఖేష్ అంబానీ (రిలయన్స్ ఇండస్ట్రీస్) – ₹8.6 ట్రిలియన్
గౌతమ్ అదానీ (అదానీ గ్రూప్) – ₹8.4 ట్రిలియన్
రోష్ని నాడర్ (HCL టెక్నాలజీస్) – ₹3.5 ట్రిలియన్
దిలీప్ షాంఘ్వీ (సన్ ఫార్మా) – ₹2.5 ట్రిలియన్
అజీమ్ ప్రేమ్‌జీ (విప్రో) – ₹2.2 ట్రిలియన్
కుమార్ మంగళం బిర్లా (ఆదిత్య బిర్లా గ్రూప్) – ₹2 ట్రిలియన్
సైరస్ పూనవల్లా (సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా) – ₹2 ట్రిలియన్
నీరాజ్ బజాజ్ (బజాజ్ ఆటో) – ₹1.6 ట్రిలియన్
రవి జైపురియా (RJ కార్ప్) – ₹1.4 ట్రిలియన్
రాధాకిషన్ దమానీ (అవెన్యూ సూపర్‌మార్ట్స్) – ₹1.4 ట్రిలియన్
భారత బిలియనీర్ ప్రొఫైల్
భారత బిలియనీర్ల సగటు సంపద 34,514 కోట్లు. ఇది చైనా బిలియనీర్ల సగటు సంపద 29,027 కోట్ల కంటే ఎక్కువ. ఫిన్‌టెక్ కంపెనీ రేజర్‌పే సహ వ్యవస్థాపకులు శశాంక్ కుమార్ , హర్షిల్ మాథుర్ 34 సంవత్సరాల వయస్సులో బిలియనీర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్కొక్కరి సంపద నికర విలువ 8,643 కోట్ల రూపాయలు. ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ చైనాకు చెందిన వాంగ్ జెలాంగ్ ఉన్నారు.
భారతదేశ బిలియనీర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది, కానీ అది యునైటెడ్ స్టేట్స్ , చైనాల్లో అత్యధిక మంది ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్ లో 870 బిలియనీర్లు, చైనాలో 823 బిలియనీర్, భారతదేశంలో 284 బిలియనీర్లు ఉన్నారు. భారతీయ బిలియనీర్ల మొత్తం సంపద సంవత్సరానికి 10 శాతం పెరిగింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

