అన్వేషించండి
Advertisement

Brahmamudi Serial Today December 03 Highlights : మరోసారి గెలిచిన ఈగో రాజ్..అపర్ణని ఇంటికి వచ్చేసింది.. కావ్య ఏం చేయబోతోంది - బ్రహ్మముడి డిసెంబరు 03 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: కావ్య విషయంలో తగ్గేదేలే అంటాడు రాజ్... ఎందుకు తగ్గవో చూస్తానంటుంది తల్లి అపర్ణ...ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇక్కడ చూడండి..

Brahmamudi Serial Today December 03 Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/10

స్టెల్లా చేసిన వంటను కక్కలేక మింగలేక తింటుంటారు రాజ్, రాహుల్, ప్రకాశం..ఉప్పు,కారం, టేస్ట్ లేకుండా చేశావేంటి అంటే ఆరోగ్యం కావాలా కొలెస్ట్రాల్ కావాలా అని సెటైర్ వేస్తుంది స్టెల్లా. ఆ భోజనం చేయలేక రాహుల్, ప్రకాశం పారిపోతారు ఇంటి ఫుడ్‌కు...ఇన్‌స్టంట్ ఫుడ్‌కు తేడా తెలిసిందా అని సీతారామయ్య సెటైర్ వేస్తాడు
2/10

కిచెన్లో ఉన్న స్టెల్లాతో.. మీరు చేసిన ఫుడ్ కన్నా మీరు అందంగా ఉన్నారంటాడు రాహుల్. మీలాంటి అందమైన అమ్మాయిలకు కుకింగ్ తో పాటూ చాలా టాలెంట్స్ ఉంటాయ్ అవేం లేవా అంటాడు.. హెడ్ మాసాజ్ చేస్తానంటుంది...అందుకోసం పదివేలు ఇచ్చిమరీ రూమ్ కి తీసుకెళ్తాడు.
3/10

బ్యూటిఫుల్ బెడ్ రూమ్ లో అగ్లీ వైఫ్ తో బెడ్ షేర్ చేసుకోవాల్సి వస్తోందని స్వప్నను తక్కువ చేస్తూ..స్టెల్లాను పొగిడేస్తాడు. రాహుల్ కి హెడ్ మసాజ్ చేస్తుంటుంది స్టెల్లా..అప్పుడే రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్వప్న చీపురుకట్టతో రాహుల్ ని ఉతుకుతుంది. స్వప్న దెబ్బలకు భయపడి స్టెల్లా కూడా పారిపోతుంది
4/10

కిందకు వచ్చిన స్టెల్లా కాపాడు చెర్రీ అంటూ రాజ్ ని పట్టుకుంటుంది. ఇది వంటమనిషి కాదు బజారు మనిషి అని స్వప్న ఉతుకుతుంది. ఇంటి మనిషికి - వంట మనిషికి ఏంటి తేడానో ఇప్పుడు అర్థమైందా అంటుంది ఇందిరాదేవి
5/10

ఇంతలో ఇంటికి విడాకుల నోటీస్ పంపిస్తుంది అపర్ణ. మమ్మీ నుంచి నోటీస్ అని రాజ్ చెప్పగానే ఆ మాట విని సుభాష్ షాక్ అవుతాడు. తన భార్య తనకు కావాలంటాడు. అసలు అత్తయ్య నోటీస్ పంపించడం ఏంటన్న కావ్యపై మొత్తం నీవల్లే అని ఫైర్ అవుతాడు. మీ అమ్మతో తేల్చుకోండి అనేసి కావ్య వెళ్లిపోతుంది
6/10

ఈ నోటీసులకు కారణం కావ్య కాదు నువ్వే అని సుభాష్ ఫైర్ అవుతాడు. మీరు మీరు గొడవలు పడి మమ్మల్ని విడదీయడం ఏంటని నిలదీస్తాడు. మాయ విషయంలో కూడా విడాకులు ఇస్తాననలేదు..ఇప్పుడు కేవలం నీవల్లే ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటాడు
7/10

కావ్యతో నా గొడవకు మీ విడాకులకు సంబంధం ఏంటని వాదిస్తాడు రాజ్. ముందు అపర్ణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటే ఏం చేయాలో ఆలోచించు అంటారు సీతారామయ్య. రేపటికల్లా అమ్మను తిరిగి తీసుకొస్తానంటాడు. కళావతి ఎప్పటికీ ఈ ఇంటికి రాదంటాడు
8/10

కావ్య ఇంట్లో అడుగుపెడుతూనే మా అత్తయ్య చేసిన పనివెనుక నీ క్రిమినల్ బ్రెయిన్ ఉందా అని కనకాన్ని నిలదీస్తుంది. నేను ఏం చేయలేదని కనకం అంటుంది. మా అత్తగారికి ఏం నేర్పిస్తున్నావ్ అని తల్లిపై ఫైర్ అవుతుంది.
9/10

ఆస్తిలో వాటా కళ్యాణ్ కి ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటుంది ధాన్యలక్ష్మి. ఆ రచ్చ చూసి సీతారామయ్య తట్టుకోలేక విలవిల్లాడుతూ గుండెనొప్పితో కిందపడిపోతాడు.
10/10

మీరెలా తయారైనా మీకన్నా బండరాయి అక్కడుంది అంటుంది కావ్య. వాడికన్నా ఓ అడుగు నేను ముందే ఉంటానంటుంది అపర్ణ. నా కాపురం కోసం మీ సంసారంలో కలతలు తెచ్చుకోవద్దు అంటుంది. నీ కొడుకు దిగొస్తే దిగొస్తాడు లేదంటే నా ఖర్మ ఇంతే అని వదిలేస్తా అనేసి.. మీరు మాఇంట్లో ఉండొద్దంటుంది
Published at : 03 Dec 2024 09:59 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
క్రైమ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion