గవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి.. ఎమోషనల్ వీడియో
ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో సెంచరీతో అదరగొట్టిన 21 ఏళ్ల నితీశ్ కుమార్ రెడ్డి పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. బాక్సింగ్ డే టెస్టు మూడో రోజు ఆటలో ఇదే హైలైట్ గా నిలిచింది. కెరీర్‌లో నాలుగో టెస్టు ఆడుతున్న నితీష్... ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి, అది కూడా జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ సెంచరీ సాధించాడు. బౌండరీతో శతకం పూర్తి చేయగానే కామెంట్రీ బాక్స్ లో ఉన్న భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చాడు. ఉత్సాహంతో ఉరకలేస్తూ కామెంట్రీ చెప్పాడు. సూపర్బ్ ఇన్నింగ్స్.. భారత క్రికెట్‌కు దొరికిన మరో యంగ్ టాలెంట్ అంటూ ప్రశంసించాడు. ఇక నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి తన కుమారుడు సెంచరీ బాదడాన్ని కళ్లారా చూసి.. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆ వీడియో బాగా వైరల్ అయింది. ఇప్పుడు ఆయన సునీల్ గావస్కర్ కాళ్లకు నమస్కరిచిన వీడియో కూడా బయటకు వచ్చింది. వద్దంటున్నా.. మోకాళ్లపై వంగిమరీ సునీల్ గావస్కర్ కాళ్లకు ముత్యాలరెడ్డి నమస్కరించారు.