అన్వేషించండి
Satyabhama Serial Today December 30 Highlights: పుట్టింటికి సత్య..మహదేవయ్య ఉచ్చులో చిక్కిన క్రిష్ - సత్యభామ డిసెంబర్ 30హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. ఇప్పుడు MLA గా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు మహదేవయ్య సత్య . ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....

Satyabhama Serial Today December 30 Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/7

మహదేవయ్యకు చెక్ పెట్టేందుకు రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అవుతుంది సత్య. తండ్రికి వ్యతిరేకంగా వెళుతున్నానని తెలిస్తే క్రిష్ ఎలా రియాక్టవుతాడో ముందుగా ఊహించి తన నుంచి మాట తీసుకుంటుంది...ఎట్టి పరిస్థితుల్లోనూ నీ చేయి వీడను అనిప్రామిస్ చేస్తాడు క్రిష్
2/7

పుట్టినరోజు ఆనందంలో సత్యకు మాటిచ్చిన క్రిష్ కి.. తాను MLA అవుతానంటూ షాక్ ఇస్తుంది. నీ నిర్ణయం వెనక్కు తీసుకో అని చెప్పినా డిసైడ్ అయిపోయా అంటూ స్ట్రాంగ్ గా చెబుతుంది..
3/7

సత్య MLA గా నామినేషన్ వేస్తుందని తెలియగానే మహదేవయ్య డ్రామా స్టార్ట్ చేస్తాడు...నేను డ్రాప్ అవుతాను సత్యను నిలబెడదాం అని. కానీ క్రిష్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదు..నిన్ను MLA గా గెలిపించి నా భుజానికెత్తుకుని తిప్పాలి బాపూ..ఎవరు అడ్డం వచ్చినా నిన్ను గెలిపించి తీరుతా అంటాడు
4/7

సత్య తండ్రి విశ్వానాథం వచ్చిచెప్పినా సత్య తన నిర్ణయం మార్పుకోదు..భైరవి, జయమ్మ సహా ఇంట్లో అందరూ నచ్చచెప్పినా వినదు. దీంతో ఇప్పటివరకూ వార్ మహదేవయ్య vs సత్య నుంచి... క్రిష్ vs సత్యగా మారింది.
5/7

MLA అవ్వాలన్న సత్య పట్టుదల క్రిష్ కి దూరం చేస్తుందో.. పంతం నెగ్గించుకుని మహదేవయ్య నిజస్వరూపం బయటపెట్టి సత్య భర్తన కాపాడుకుంటుందో చూడాలి...
6/7

మరోవైపు మహదేవయ్య రాజకీయ ప్రత్యర్థి నర్సింహ ఒక్క అవకాశం వచ్చినా ఆ మహదేవయ్యను పడగొడతా అని కాచుకు కూచున్నాడు. ఈ టైమ్ లో మహదేవయ్యకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా సత్య బరిలోకి దిగుతుందని తెలిస్తే అప్పుడుంటుంది అసలు కథ..
7/7

డిసెంబర్ 30 ఎపిసోడ్ లో క్రిష్ తీసుకునే నిర్ణయమే హైలెట్ కాబోతోంది..తల్లి బైరవి మాట విని భార్య సత్యను పుట్టింటికి పంపిస్తాడో లేదంటే తన చేయివీడను అని చెబుతాడో చూడాలి...
Published at : 29 Dec 2024 09:59 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion