అన్వేషించండి
Brahmamudi December 30th Episode: అనామికకు మరో ఛాన్స్ ఇస్తోన్న కావ్య రాజ్.. రెచ్చిపోయిన రుద్రాణి - బ్రహ్మముడి డిసెంబరు 30 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: కావ్య పేరుమీద ఆస్తి మొత్తం రాసేసిన సీతారామయ్య... ష్యూరిటీ సంతకం పెట్టి కొత్త కష్టాలు తీసుకొచ్చాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Brahmamudi December 30th Episode (Disney Plus Hotstar/ Star Maa)
1/6

ఆస్తి మొత్తం కావ్య పేరుమీద రాసేసిన సీతారామయ్యపై రగిలిపోతున్నారు రుద్రాణి, ధాన్యలక్ష్మి. అదే సమయంలో సీతారామయ్య చేసిన వందకోట్ల ష్యూరిటీ సంతకం గురించి రాజ్ చెప్పడంతో షాక్ అవుతుంది. దాన్నుంచి బయపడే ప్రయత్నాల్లో ఉన్నారు రాజ్ కావ్య..
2/6

భార్య పేరెత్తితేనే అంతెత్తున ఎగిరిపడే రాజ్..ఇప్పుడు ఇంట్లో ఎవరు ఏమన్నా తనే ముందుకువచ్చి సమాధానం చెప్పి నా భార్య అంటూ చేయిపట్టుకుని తీసుకెళ్లిపోతున్నాడు.
3/6

ఇప్పటివరకూ అపర్ణ, ఇందిరాదేవికి సందేహం వచ్చినా కవర్ చేస్తూ వచ్చారు రాజ్ అండ్ కావ్య. ఇప్పుడు కార్లు కూడా అమ్మేస్తున్నారని అడిగితే ఏం సమాధానం చెబుతారో చూడాలి
4/6

నాలుగు విడతలుగా బ్యాంక్ కి వందకోట్లు కడతాం అని హామీ ఇస్తుంది కావ్య..మరోవైపు హాస్పిటల్లో సీతారామయ్య బిల్లు కట్టేందుకు ఇక్కట్లు పడుతుంటారు. స్వప్న కొనుక్కున్న నక్లెస్ అమ్మేద్దాం అని కావ్య అంటే వద్దంటాడు రాజ్. చేసేది లేక మరో ఆప్షన్ వెతుక్కుంటారు
5/6

బ్రహ్మముడి డిసెంబర్ 30 ఎపిసోడ్ లో ...కార్లు అన్నీ పంపించేస్తారు కావ్య రాజ్.. ఇదంతా మేడపై నుంచి చూస్తుంది రుద్రాణి. కాస్ట్ కటింగ్ లో భాగంగా డబ్బులు ఇవ్వడం తగ్గించారు, ఫుడ్ విషయంలో ఆంక్షలు పెట్టారు..ఇప్పుడు కార్లు అమ్మేస్తున్నారు..దీనిపై తగ్గేదే లే అని డిసైడ్ అవుతుంది
6/6

మరోవైపు ఇంట్లో వాళ్లదగ్గర రహస్యం దాచడం..అనామిక ద్వారా రుద్రాణి తెలుసుకుని బయటపెట్టడం..అప్పుడు ఇంకొంత గొడవ పెరగడం కామన్ అయిపోయింది. ఇప్పుడు కూడా అనామిక ఎంట్రీతోనే వందకోట్ల విషయం బయటపడుతుందేమో చూడాలి...
Published at : 29 Dec 2024 10:43 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
నిజామాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion